
కరోనా నుంచి కోలుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దైవ దర్శనాలతో బీజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం ఆయన తన భార్య రమతో కలిసి కర్ణాటకలోని చామరజనగర్ జిల్లాలోని హిమవద్ గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా కరోనా బారిన పడిన రాజమౌళి కుటుంబం కొద్ది రోజుల క్రితం ఆ వైరస్ నుంచి కోలకుని విజయవంతంగా బయటపడ్డారు. దీంతో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు జక్కన్న ఆలయ సందర్శన చేపట్టినట్లు తెలుస్తోంది.
కాగా, రాజమౌళి బహుబలి తర్వాత మరో భారీ బడ్జెట్ చిత్రం “ఆర్ఆర్ఆర్”కు ఆయన పని చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, నటుడు అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.