శ్రీశైలం అగ్నిప్రమాదానికి ఇదే కారణం: క‌లెక్ట‌ర్

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి షార్ట్‌స‌ర్క్యూ‌టే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ అన్నారు.

శ్రీశైలం అగ్నిప్రమాదానికి ఇదే కారణం: క‌లెక్ట‌ర్
Follow us

|

Updated on: Aug 21, 2020 | 11:00 AM

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి షార్ట్‌స‌ర్క్యూ‌టే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ అన్నారు. ప్ర‌మాద స్థ‌లాన్ని క‌లెక్ట‌ర్ శర్మన్ ప‌రిశీలించారు. రాత్రి 10.30 గంటలకు మొదటి యూనిట్లో షార్ట్‌స‌ర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని అగ్నిప్ర‌మాదం జరిగిందని ఆయన తెలిపారు. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయ‌ని, దీంతో సొరంగం‌లో దట్టంగా పొగలు క‌మ్ముకున్నాయ‌న్నారు. పొగ‌ల కార‌ణంగా బ‌య‌టికి రాలేక‌పోవ‌డంతో తొమ్మిది మంది అక్క‌డే చిక్కుకుపోయారన్నారు. బయటకు వచ్చే అన్ని దారుల్లో పొగ అలుముకుందని, అలాగే ఎమర్జెన్సీ ద్వారంలోనూ దట్టంగా పొగలు వెలువడ్డాయన్న ఆయన లోపలి నుంచి సిబ్బంది బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయిందన్నారు కలెక్టర్ శర్మన్. ఈ ఘటనపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారన్నారు. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లిన రిస్య్కూ టీం పొగ కారణంగా వెనక్కు వచ్చారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురు సిబ్బంది జెన్ కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ వెల్ల‌డించారు.

Latest Articles