SpiceJet introduces in-flight entertainment: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు స్పైస్‌జెట్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సొంత డివైజ్‌లలోనే వినోద కార్యక్రమాల ప్రసారాలను వీక్షించేలా వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇన్-ఫ్లయిట్-ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం స్పైస్ స్క్రీన్ పేరిట మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇందులో తెలుగు సహా 8 ప్రాంతీయ భాషల్లో సినిమాలు, కార్య్రక్రమాలు, షోలు ఉంటాయని తెలిపింది. వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ప్రయాణీకుల వ్యక్తిగత పరికరాలకు కంటెంట్‌ను అందిస్తామని పేర్కొంది. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ ఆన్-బోర్డు వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం ద్వారా సేవలు పొందవచ్చని స్పైస్‌జెట్ తెలిపింది.
Read More:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..