‘మన్యం పులి’ ఐపీఎల్‌లో వేట మొదలెట్టబోతుంది..మోహన్ లాల్ రాణిస్తాడా !

'మన్యం పులి' ఐపీఎల్‌లో వేట మొదలెట్టబోతుంది..మోహన్ లాల్ రాణిస్తాడా !

ఐపీఎల్ వచ్చే సీజన్‌కు కొత్త టీమ్ రాబోతుందా అంటే..అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా  యూఏఈలో జరగడంతో ఈ సీజన్ అంత కిక్ ఇవ్వలేదు.

Ram Naramaneni

|

Nov 12, 2020 | 9:25 PM

ఐపీఎల్ వచ్చే సీజన్‌కు కొత్త టీమ్ రాబోతుందా అంటే..అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా  యూఏఈలో జరగడంతో ఈ సీజన్ అంత కిక్ ఇవ్వలేదు. అదేదో అలవాటు మాదిరిగా ముంబై ఇండియన్స్‌ టీమ్ ఫైనల్‌కు వచ్చి కప్ ఎగరేసుకుపోయింది. వచ్చే ఏడాది ఐపీఎల్ ఇండియాలో ఉంటుందని  బిసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అది కూడా ఏప్రిల్, మే నెలల్లోనే జరగనుందని పేర్కొన్నారు. ఆ రకంగా చూస్తే ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. అయితే బీసీసీఐ ఈ సారి సీజన్ గురించి అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కొత్త ఫ్రాంచైజీ రేస్‌లోకి దిగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  కొత్త ఫ్రాంచైజీ వస్తే ఈ సారి వేలం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీలకు బీసీసీఐ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మాములుగా అయితే ప్రతీ సీజన్ వేలం డిసెంబర్‌లోనే జరుగుతుంది, కానీ ఈ సారి 2021 ఆరంభంలో వేలం నిర్వహించనున్నారట.

మరో క్రేజీ న్యూస్ ఏంటంటే కొత్తగా వచ్చే ఫ్రాంచైజీని,  మొబైల్ అప్లికేషన్ కంపెనీ ‘బైజుస్’ తో కలిసి కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన అందుకే హాజరయ్యారని మీడియాకు ఉప్పందింది. ప్రస్తుత  ఈ సీజన్‌లో ఆడియెన్స్‌ను స్టేడియానికి అనుమతించడం లేదు. కానీ మోహన్ లాల్ రావడంతో కొత్త ఫ్రాంచైజీ కోసమే అక్కడికి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే  కొత్తగా రాబోయే 9వ జట్టును అహ్మదాబాద్‌ లేదా కేరళ బేస్డ్‌గా ఏర్పాటయ్యే ఛాన్స్  ఉందని తెలుస్తోంది. మరి కొత్త జట్టు వస్తే మ్యాచుల సంఖ్యతో పాటు షెడ్యూల్ సమయం కూడా పెరుగుతోంది. దీంతో క్రీడాభిమానులకు మరింత మజా దొరుకుతుంది.

Also Read : 

నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్

రోజూ ‘జానీ వాకర్’ ఫుల్ బాటిల్ తాగేస్తున్న దున్నపోతు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu