Sonu Sood Ambulance Service: లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి, సొంతింటికి వెళ్లడానికి డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డ వలస కార్మికులు అన్నీ తానై ఆదుకున్నాడు నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రలను పోషించే సోనూసూద్ రియల్ లైఫ్‌లో మాత్రం హీరోగా మారాడు.
ట్విట్టర్ వేదికగా ఎవరేం అడిగినా లేదనకుండా ఇచ్చి దేవుడిగా మారాడు సోనూ. అందుకే సోనూసూద్ గొప్పమనసును గుర్తించిన తెలంగాణకు చెందిన కొందరు అభిమానులు ఏకంగా గుడి కట్టించారు. ఇలా ఏదో ఒక సేవ కార్యక్రమంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోన్న సోనూసూద్ తాజాగా మరోసారి కొత్త సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు అడిగిన వారికే సాయం చేసిన సోనూ.. ఇప్పుడు ఆపదలో ఉన్నవారందరికీ తన సేవను అందించేలా అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. ఇటీవల కొన్ని వ్యాన్లను కొనుగోలు చేసిన సోనూసూద్ వాటిని అంబులెన్సులుగా మార్చారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఈ సేవలను ప్రారంభించగా, రానున్న రోజుల్లో ఈ సేవలను ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నారు. ‘సోనూసూద్ అంబులెన్స్ సర్వీసెస్’ పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Also Read: Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. బాక్సింగ్ పంచ్‌తో అదరగొడుతున్న మెగా హీరో..