AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగరెట్లు, బీడీల కోసం ఎంతకు తెగించావ్‌రా.. చిల్లర డబ్బుల కోసం కన్నతండ్రినే కడతేర్చాడు..

తెలంగాణలోని నల్లగొండ పట్టణంలో డబ్బుల విషయంలో జరిగిన గొడవ విషాదాంతమైంది. సిగరెట్లు, బీడీలు కొనడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో గణేష్ అనే వ్యక్తి తన తండ్రి లింగయ్య (66)పై గొడ్డలితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సిగరెట్లు, బీడీల కోసం ఎంతకు తెగించావ్‌రా.. చిల్లర డబ్బుల కోసం కన్నతండ్రినే కడతేర్చాడు..
Son Kills Father
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 10:39 AM

Share

కన్నతండ్రి.. కొడుకును ప్రయోజకుడిగా చూడాలని కలలు కన్నాడు. తన రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యంలో కొడుకు అండగా ఉంటాడనుకున్న తండ్రికి.. అదే కొడుకు నుంచి మృత్యువు ఎదురైంది. చిన్న కారణం.. చివరకు తండ్రి ప్రాణాలనే తీసింది. క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీస్తే.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. నల్లగొండ పట్టణం మునుగోడు రోడ్డు హనుమాన్ నగర్ కాలనీలో గొర్లకాపరిగా సురిగళ్ళ లింగయ్య(66), నర్సమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు వివాహం చేసుకుని వేరుగా ఉంటుండగా.. చిన్న కుమారుడు గణేష్‌ (38) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే గణేష్ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఇంటి వద్దే ఉంటున్న గణేష్‌కు తండ్రితో డబ్బుల విషయంలో తరచూ గొడవ పడుతుండేవాడు. రోజూ మాదిరిగానే లింగయ్య గొర్రెలను మేపేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో సిగరెట్లు, బీడీలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలంటూ తండ్రిని గణేష్ డిమాండ్ చేశాడు.

అయితే తన దగ్గర డబ్బులు లేవని లింగయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన గణేష్.. ఇంటి రేకులపై ఉన్న గొడ్డలిని తీసుకుని కన్నతండ్రిపై దాడి చేశాడు. ఊహించని ఈ ఘోర దాడితో తీవ్ర రక్తస్రావమై, తండ్రి లింగయ్య అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

కళ్లముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య నర్సమ్మ కన్నీరు మున్నీరైంది. కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలుసుకున్న నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Follow Us