AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soft Chapati: పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..

మన భారతీయ వంటకాల్లో చపాతీలకు ప్రత్యేక స్థానం ఉంది. మార్నింగ్ బ్రెక్ ఫాస్ట్ లోకి అయినా.. లేదా మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఏ టైంలో అయినా వీటిని మనం ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే వీటితో వచ్చిన ప్రాబ్లమ్ ఏమిటంటే చేపిన కాసేపటికే ఇవి గట్టి పడిపోతుంటాయి. కానీ మీకు ఒక సింపుల్ చిట్కా గురించి తెలిస్తే.. చపాతీలు పామంత్రం వరకు మొత్తగా ఉండేలా చేయవచ్చు. అదెలానో చూద్దాం.

Soft Chapati: పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
Soft Chapati Tips
Anand T
|

Updated on: Nov 25, 2026 | 7:26 PM

Share

చపాతీలు చేసిన కొద్దిసేపటికే గట్టిగా మారిపోతున్నాయా? ఇది ప్రతి ఒక్కిరి ఇంట్లో ఉండే సమస్య.. దీనిని పరిష్కారం ఏమిటో చాలా మందికి తెలియదు. కానీ పిండి కలిపే విధానం, కాల్చే పద్ధతిలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే చాలు మీరు సాయంత్రం వరకు మొత్తగా ఉండే చపాతీలను ఈజీగా చేసుకోవచ్చు. అవును పిండి కలిపేటప్పుడు మీరు ఈ చిట్కాలను ఫాలో అయితే చాలు లంచ్ బాక్స్‌లో పెట్టుకున్నా, సాయంత్రం వరకు ఉంచినా చపాతీలు దూదిలా మెత్తగా, పుల్కాలా పొంగుతూ ఉంటాయి. కాబట్టి దానికి ఏం పదార్థాలు కావాలి. ఆ చిట్కా ఏమిటో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • గోధుమ పిండి: 2 కప్పులు
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నీళ్లు: సుమారు 1.25 నుండి 1.5 కప్పుల వరకు
  • నూనె: 2 నుండి 3 టీస్పూన్లు

పిండి కలపడంలోనే అసలు రహస్యం

మీకు చపాతీలు మొత్తగా మృదువుగా రావాలంటే.. చపాతీల కోసం పిండి తయారు చేసే ప్రక్రియే చాలా ముఖ్యం. కాబట్టి మీరు ముందుగా గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. నీటిని ఒకేసారి పోయకుండా, కొద్దికొద్దిగా పోస్తూ మునివేళ్లతో సున్నితంగా కలపాలి. తగినన్ని నీళ్లు చేర్చిన తర్వాత పిండిని సుమారు 6 నుండి 7 నిమిషాల పాటు గట్టిగా నొక్కుతూ కలపాలి.పిండి పూరీ పిండిలా గట్టిగా కాకుండా మృదువుగా ఉండాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల నూనె వేసి మరో రెండు నిమిషాలు కలిపి, కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు నానబెట్టాలి.

తర్వాత చేతులకు కొద్దిగా నూనె రాసుకొని పిండిని ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడ వాటిని పొడి పిండిలో ముంచి, ఒక చేతితో పట్టుకుని మరో చేతితో నెమ్మదిగా రోల్ చేస్తే సమానంగా వస్తుంది. పూరీ కంటే కొంచెం పెద్దగా రోల్ చేశాక నూనె రాసి సగానికి మడతపెట్టాలి. మళ్లీ నూనె రాసి మరోసారి మడతపెట్టి పొడి పిండిలో ముంచి రోల్ చేయాలి. మధ్యలో కాకుండా అంచులపై ఒత్తిడి పెడుతూ రోల్ చేస్తే చపాతీ చక్కగా పొంగుతుంది.

కాల్చే పద్దతి

చపాతీలు సరిగ్గా రావాలంటే కాల్చే పద్దతి కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పెనం బాగా వేడిగా ఉండాలి. వేడి పెనంపై వేసిన 5 నుండి 10 సెకన్లలో చిన్న బుడగలు రాగానే తిప్పాలి. మరోవైపు తిప్పగానే చపాతీ పొంగడం మొదలవుతుంది. సుమారు 10 సెకన్లు కాల్చి మళ్లీ తిప్పుతూ రెండు వైపులా వేయించాలి.

కావాలి అనుకుంటే మీరు నూనె కూడా వేసి కాల్చుకోవచ్చు లేదా డైట్‌లో ఉన్నవారు నూనె లేకుండా కూడా కాల్చుకోవచ్చు; రెండింటిలోనూ మృదువుగానే ఉంటాయి. అయితే తక్కువ మంటపై కాల్చితే చల్లారిన తర్వాత చపాతీలు గట్టిపడతాయి. తేమ పోకుండా ఉండటానికి హై ఫ్లేమ్‌లో వేగంగా కాల్చాలి.

కాల్చిన చపాతీలను హాట్ బాక్స్‌లో వేసి మూతను పూర్తిగా బిగించకుండా కొద్దిగా తెరిచి ఉంచాలి. వేడికి నీరు చేరి మెత్తబడకుండా ఇది సహాయపడుతుంది. కాబట్టి హాట్ బాక్స్ లేకపోతే స్టీల్ గిన్నెలో పెట్టి మూత వేసినా మృదువుగా ఉంటాయి. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చపాతీలు సాయంత్రం వరకు మొత్తగా మృదువుగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు
పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!
కొంపముంచిన 75 సెకన్ల రూల్.. ఒక్క బాల్ ఆడకుండానే అవుట్
కొంపముంచిన 75 సెకన్ల రూల్.. ఒక్క బాల్ ఆడకుండానే అవుట్
పులిపిర్లు పూర్తిగా రాలిపోయే సింపుల్ టిప్.. పక్కా రిజల్ట్
పులిపిర్లు పూర్తిగా రాలిపోయే సింపుల్ టిప్.. పక్కా రిజల్ట్
చర్మం పొడిబారకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు రాయాలా తెలుసా?
చర్మం పొడిబారకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు రాయాలా తెలుసా?
బుధుడి నక్షత్ర మార్పు.. ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
బుధుడి నక్షత్ర మార్పు.. ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!