AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. ఏమి అందం..! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము.. ఏం చేసిందో చూస్తే..

పాములు కూడా తమ అందాన్ని చూసి గర్వపడతాయా..? వినడానికి చాలా వింతగా ఉంది కదూ..! కానీ, ఇక్కడ ఒక పాము అద్దంలో చూసుకుంటూ ఏం చేసిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..ఒక పెద్ద నల్లటి సర్పం ఒకటి నిలువెత్తు అద్దం ముందు సినిమా స్టైల్లో ఫోజులిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అదేంటో మనం కూడా చూసేద్దాం....

ఆహా.. ఏమి అందం..! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము.. ఏం చేసిందో చూస్తే..
Snake Dance In Front Of Mirror
Jyothi Gadda
|

Updated on: Feb 04, 2026 | 8:01 AM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్‌ అవుతుందో ఎవరూ చెప్పలేరు..కానీ, పాములకు సంబంధించిన వీడియోలు మాత్రం ఎప్పుడైనా సరైనా ట్రెండింగ్‌లోనే ఉంటున్నాయి. స్నేక్‌ వీడియోలు అంటే నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ సారి కూడా అలాంటిదే ఒక భారీ సర్పానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ అరుదైన దృశ్యాన్ని స్నేక్‌ క్యాచర్‌ కళ్యాణ్ రాజ్ గైకర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @snakefriend_raj ద్వారా షేర్‌ చేశారు. . ఈ వీడియోకు ఇప్పటివరకు 1.7 మిలియన్లకు పైగా వ్యూస్‌, 59,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

ఈ వైరల్ వీడియో ఒక ఇంటి లోపలి దృశ్యం. ఇందులో ఒక పెద్ద అద్దం ఎదురుగా నల్లటి రంగులో ఉన్న భారీ పాముతో ప్రారంభమవుతుంది. మొదట, అది ప్రశాంతంగా తనను తాను చూసుకుంటుంది. కానీ,ఆ మరుసటి క్షణం అది అద్భుతమైన నృత్యం చేస్తున్నట్లుగా గాలిలో ఊగడం ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఇది నృత్యం కాదని, ప్రాదేశిక పోరాటం అని తెలుస్తుంది. పాము అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తన ప్రత్యర్థి పాము అని భావించింది. వెంటనే అది తన నాలుకను చాచి అద్దం దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ, దానికి ఎదురుగా ఉన్న పాము కూడా అదే చేస్తున్నట్లు గ్రహించి, వెంటనే వెనక్కి తగ్గుతుంది.

ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని, నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఇది చూసిన ఒక యూజర్ ఇలా అన్నాడు.. పాము అనుకుంటుందట.. నేను ఎందుకు అంత అందంగా ఉన్నాను?’ అని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోందని, మరొక యూజర్ ఇలా అన్నాడు, ఆ పాము దానికి సరైన జోడీ దొరికిందని అనుకుందని రాశాడు. మరో వ్యక్తి సరదాగా స్పందిస్తూ.. పాము మనిషి కంటే బాగా పోజులిచ్చిందని రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..
పాత సిమ్ కార్డులతో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..! అదేలాగో తెలిస్తే
పాత సిమ్ కార్డులతో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..! అదేలాగో తెలిస్తే
బంగారం ధరలపై సీన్ రివర్స్.. మళ్లీ పెరిగిన రేట్లు
బంగారం ధరలపై సీన్ రివర్స్.. మళ్లీ పెరిగిన రేట్లు
'ధురంధర్ 2' టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
'ధురంధర్ 2' టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
OTTలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమా.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమా.. IMDBలోనూ టాప్ రేటింగ్