Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా-ట్రేడ్ డీల్ తర్వాత మళ్లీ పసిడి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగడం లేదా తగ్గడం చోటుసుకుంటుంది. ఎంసీఎక్స్ ట్రేడింగ్ సెషన్‌లో ప్రతీ సెకన్‌కు ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. బుధవారం గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి.

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ సెకన్‌కు గోల్డ్, సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ధరలు భారీగా కుప్పకూలగా.. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.1,53,940 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ.1,53,930 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,110 వద్ద ట్రేడవుతోండగా.. మంగళవారం దీని ధర రూ.1,41,100గా ఉంది.
–విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,940 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,110 వద్ద స్ధిరపడింది.
-ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,680 వద్ద కొనసాగుతోండగా.. మంగళవారం ఈ ధర రూ.1,55,670 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్లు చూస్తే ఇవాళ రూ.1,42,710 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,42,700 వద్ద స్ధిరపడింది.
-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.1,53,940 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,110 వద్ద స్ధిరపడింది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090 వద్ద ట్రేడవుతుండగా.. మంగళవారం ఈ ధర రూ.1,54,080 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల రేటు ప్రస్తుతం రూ.1,41,260గా ఉంది.
వెండి రేట్లు ఇవే..
-వెండి రేట్లు స్వల్పంగా తగ్గిపోయాయి
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఇది రూ.2.80 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర ఇవాళ రూ.2,99,900గా ఉంది. నిన్న ఈ రేటు రూ.3 లక్షలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
-చెన్నైలో కేజీ వెండి ధర బుధవారం రూ.2.99,900గా కొనసాగుతోంది. నిన్న రూ.3 లక్షల వద్ద స్థిరపడింది
-బెంగళూరులో కేజీ వెండి రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారం రూ.2.80 లక్షలుగా ఉంది.
