AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం మరో అప్డేట్.. మస్క్‌డ్ ఆధార్‌పై కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆధార్ పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గత నెలలో ఈ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మీరు సెకన్ల వ్యవధిలోనే మస్క్‌డ్ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం మరో అప్డేట్.. మస్క్‌డ్ ఆధార్‌పై కీలక ప్రకటన
Aadhaar New App
Venkatrao Lella
|

Updated on: Feb 04, 2026 | 7:51 AM

Share

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆధార్ వినియోగదారులకు కోసం కొత్త యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ దుర్వినియోగం కాకుండా సురక్షితంగా, సులభతరంగా ఉపయోగించుకునేందుకు నూతన యాప్‌ను ప్రారంభించింది. ఆధార్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌లో అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్, అడ్రస్ మరింత ఈజీగా ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా అప్డేట్ చేసుకునే సౌలభ్యంతో పాటు పేపర్ లెస్ విధానంలో ఆధార్‌ను ఉపయోగించుకునేలా డిజిటల్ ఆధార్‌ను యాప్‌లో ప్రవేశపెట్టింది. ఇక బయోమెట్రిక్ వివరాలు సింపుల్‌గా లాక్ లేదా ఆన్ లాక్ చేసుకోవడంతో పాటు ఆధార్‌లో ఏ వివరాలు అయితే ఇతరులకు పంచుకుంటున్నారనేది మీరే సెలక్ట్ చేసుకుని వాటిని మాత్రమే షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతరులు మీ విషయాలన్నీ తెలుసుకోలేరు.

మస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్

మీ ఆధార్ కార్డులను ఇతరులు వాడకుండా డేటాకు భద్రత కల్పించేందుకు యూఐడీఏఐ మస్క్‌డ్ ఆధార్ కార్డులనుగతంలోనే ప్రవేశపెట్టింది. ఈ ఆధార్ కార్డులు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయి. వీటిల్లో మీ ఆధార్ కార్డు నెంబర్‌లోని కేవలం నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగతావి ఇంటూ మార్క్ చేసి మాస్క్ చేసి ఉంటాయి. ఇక మిగతా వివరాలైన ఫొటో, అడ్రస్, క్యూఆర్ కోడ్ వంటి వివరాలు సాధారణంగా కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్‌ను ఇతరుల దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు దీనిని యూఐడీఏఐ ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. ఎయిర్‌పోర్ట్స్, ట్రైన్ టికెట్ల బుకింగ్ వంటి సమయాల్లో వెరిఫికేషన్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇది ఉపయోగపడదు.  ఈ మస్క్‌డ్ ఆధార్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..? దీని ప్రత్యేకతలు ఏంటనే దానిపై యూఐడీఏఐ ఒక వీడియో విడుదల చేసింది. దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలను స్టెప్ బై స్టెప్ అందులో తెలిపింది.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆధార్ అని సెర్చ్ చేయండి -ఆధార్ పేరుతో ఉన్న యూఐడీఏఐ రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి -మీ ఆధార్ నెంబర్‌తో లాగిన్ అయ్యి 6 డిజిట్ పిన్ సెట్ చేసుకోండి -6 డిజిట్ పిన్‌తో లాగిన్ అవ్వండి -ఆ తర్వాత యాప్ మెయిన్ పేజీ వస్తుంది -అక్కడ డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి -మస్క్‌డ్ లేదా అన్‌మస్క్‌డ్ కావాలా ఎంపికను సెలక్ట్ చేసుకోండి -మస్క్‌డ్‌ను సెలక్ట్ చేసుకుని డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయండి -వెంటనే మీ ఈ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్ లోడ్ అవుతుంది

Follow Us
దారుణం.. కారు బ్యానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
దారుణం.. కారు బ్యానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..