Singer Sunitha Instagram Post: తన గాన గాత్రంతో ఎంతో మందిని ఆకట్టుకుంది సింగర్ సునీత. సినిమా స్టార్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుందీ స్టార్ సింగర్. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది సునీత. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అడపాదడపా పోస్ట్‌లు చేస్తోంది. ఇందులో భాగంగానే సునీత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వాటికి ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎక్కడో ఫామ్ హౌజ్‌లో పంట పొలాల నడుమ దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసిన సునీత ఆ ఫొటోలతో పాటు.. ‘ఏదైనా కొత్తది ప్రారంభించడానికి ఎప్పుడూ ఆలస్యం చేయెద్దు. ఆనందంగా జీవితాన్ని గడపడాన్ని ఎప్పుడూ ఆలస్యం చేయొద్దు’ అనే అర్థం వచ్చేలా ఉన్న జాన్ ఫోండా అనే అమెరిక రచయిత్రి కొటేషన్ ఉటంకిస్తూ క్యాప్షన్ జోడించింది. ఇక ఈ క్యాప్షన్‌ను సునీత తన వ్యక్తిగత జీవితాన్ని ప్రతి బింబించేలా పెట్టిందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Prabhas Salaar movie : ప్రభాస్ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడు ప్రశాంత్ నీల్..