రోడ్డుపై ‘వెండి వర్షం’..? ఎగబడ్డ జనాలు..!
రోడ్డుపై వెండి వర్షం కురిస్తే ఎలా ఉంటుంది..? వినడానికి బాగానే ఉంటాది. కానీ నిజంగా జరిగితే.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదా.. కానీ ఇది నిజం. ఏంటి షాక్ అవుతున్నారా..? వినడానికి వింతగా ఉన్నా.. ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతం బీహార్‌లోని సుర్సంద్ వద్ద అచ్చం అలాగే జరిగింది. రాత్రి పడుకొని.. ఉదయాన్నే లేచి చూసే సరికి రోడ్డు మీద అంతా వెండి పరుచుకుని ఉంది. చిన్న చిన్న పూసలు.. గోళీల రూపంలో అవి రోడ్డు మీద ప్రత్యక్ష్యమయ్యాయి. […]
రోడ్డుపై వెండి వర్షం కురిస్తే ఎలా ఉంటుంది..? వినడానికి బాగానే ఉంటాది. కానీ నిజంగా జరిగితే.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదా.. కానీ ఇది నిజం. ఏంటి షాక్ అవుతున్నారా..? వినడానికి వింతగా ఉన్నా.. ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతం బీహార్‌లోని సుర్సంద్ వద్ద అచ్చం అలాగే జరిగింది. రాత్రి పడుకొని.. ఉదయాన్నే లేచి చూసే సరికి రోడ్డు మీద అంతా వెండి పరుచుకుని ఉంది. చిన్న చిన్న పూసలు.. గోళీల రూపంలో అవి రోడ్డు మీద ప్రత్యక్ష్యమయ్యాయి. ముందు ఇందేంటని అక్కడి జనం ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత అది వెండి అని తెలుసుకుని.. ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఎవరికి చేతికి అందింది వారు దండుకుని పోయారు.
అయితే.. ఇది కేవలం.. బాబా భీం రావ్ అంబేద్కర్ టవర్ చౌక్ నుంచి సుర్సంద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కాలేజీ వరకు వెండి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే.. అక్కడి మాత్రమే ఇవి ఉంటడంతో ఆశ్చర్యపోయిన స్థానికులు.. ఇది ఖచ్చితంగా.. స్మగ్లర్ల పనే అయి ఉంటుందని.. అనుమానిస్తున్నారు. నేపాల్-సుర్సంద్ రహదారిలో అర్థరాత్రులు ఎక్కువగా.. బంగారం, వెండిని అక్రమంగా రవాణా చేస్తారు స్మగ్లర్లు. ఆ సమయంలో.. ఇక్కడ పడి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.