AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరంచిన శ్రద్ధా..

రెబల్ స్టార్ ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను సాహో మూవీ ఫేం నటి శ్రద్ధా కపూర్ స్వీకరించింది. ప్రభాస్ నామినేషన్ ను యాక్సెప్ట్ చేసిన శ్రద్ధా మొక్కలను నాటి.. దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరంచిన శ్రద్ధా..
Balaraju Goud
|

Updated on: Sep 17, 2020 | 4:54 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను సాహో మూవీ ఫేం నటి శ్రద్ధా కపూర్ స్వీకరించింది. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ శివారులోని దుండిగల్ సమీపంలోని కాజీపల్లి రిజర్వు ఫారెస్టు వద్ద సుమారు 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నాడు. తన తండ్రి పేరిట అడవి భూమిని అర్భన్ పార్కుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించాడు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించారు. తానూ ఎప్పడు నేచర్ లవర్ నే అని చెప్పిన ప్రభాస్ తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, తన ఛాలెంజ్ ను పూర్తి చేసిన తరువాత శ్రద్ధా కపూర్ ను నామినేట్ చేశాడు. ప్రభాస్ నామినేషన్ ను యాక్సెప్ట్ చేసిన శ్రద్ధా మొక్కలను నాటి.. దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోను షేర్ చేసింది. ” గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నన్ను నామినేట్ చేసినందుకు ప్రభాస్ నీకు ధన్యావాదాలు. నేను ఇప్పుడే కొన్ని మొక్కలు నాటాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు శ్రద్ధా.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్ కూడా తన ట్విట్ ఎకౌంట్ లో దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టాడు. శ్రద్ధా కపూర్ మొక్కలు నాటిన ఫోటోను షేర్ చేశారు. “బాహుబలి ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసినందుకు శ్రద్దా కపూర్ కి ధన్యవాదాలు. మీ అభిమానగణం ఈ మంచి పనిని ముందుకు తీసుకెళ్తారు అని.. బాలీవుడ్, టాలీవుడ్ లో దీనిని అమలు చేస్తారు అని ఆశిస్తుస్తున్నాను అని ట్వీట్ చేశారు.

రాజ్య సభ ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను టాలీవుడ్ తారలతో పాటు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. రాజకీయ, వ్యాపార, క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ టాస్క్ ను పూర్తి చేస్తున్నారు. పచ్చదనాన్ని ప్రోత్సాహించే ఇలాంటి ఛాలెంజ్ లు మనకు అవసరం అని సెలబ్రిటీలు అంటున్నారు.

Follow Us
ప్లాటినం బంగారాన్ని మించిపోతుందా? ఇప్పుడు కొంటే 5 ఏళ్లలో..
ప్లాటినం బంగారాన్ని మించిపోతుందా? ఇప్పుడు కొంటే 5 ఏళ్లలో..
బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్
బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్
హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే..
హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే..
'గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ..5లక్షల సాయంతో పాటు..
'గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ..5లక్షల సాయంతో పాటు..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే