సూర్య కిరణాలు మన శరీరానికి ఎంత నష్టం చేస్తున్నాయో తెలుసా..!
సూర్యుడి నుంచి వచ్చే కొన్ని కిరణాల వలన మానవ శరీరానికి చాలా ముప్పు ఉంటుంది. ముఖ్యంగా అతినీలలోహిత కిరణాల వలన మానవులకు పలు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కిరణాల నుంచి కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకు తెలీకుండానే మన శరీరం చాలా నష్టపోతోంది. ఆ నష్టం ఎంతన్నది మనకు మామూలుగా కనిపించదు. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలను ఉపయోగించిన ఫైర్రే-లోయిస్ ఫెర్రర్ అనే ఫొటోగ్రాఫర్ మన శరీరానికి సూర్య కిరణాలు ఎంత […]
సూర్యుడి నుంచి వచ్చే కొన్ని కిరణాల వలన మానవ శరీరానికి చాలా ముప్పు ఉంటుంది. ముఖ్యంగా అతినీలలోహిత కిరణాల వలన మానవులకు పలు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కిరణాల నుంచి కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకు తెలీకుండానే మన శరీరం చాలా నష్టపోతోంది. ఆ నష్టం ఎంతన్నది మనకు మామూలుగా కనిపించదు. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలను ఉపయోగించిన ఫైర్రే-లోయిస్ ఫెర్రర్ అనే ఫొటోగ్రాఫర్ మన శరీరానికి సూర్య కిరణాలు ఎంత నష్టం చేస్తున్నాయో చూపించే ప్రయత్నం చేశారు. ‘రా’ పేరుతో కొందరి మోడళ్ల బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను తీసిన ఫెర్రర్ వారికి చూపించాడు. అందులో తమను తాము గుర్తుపట్టలేకపోయామని మోడళ్లు తనతో చెప్పినట్లు వెల్లడించారు.
మనకు కనిపించే పరిధిని దాటి చూడాలని తాను ఎప్పుడూ అనకునేవాడినని, అందులో భాగంగా ఆల్ట్రావయోలెట్ ఫొటోగ్రఫీని ఉపయోగించి ఈ ప్రయోగం చేశానని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కెమెరాలను తయారుచేశామని ఆయన తెలిపారు. కాగా మన కళ్లు సాధారణంగా 380- 700 నానో మీటర్ల తరంగధైర్ఘ్యాలను మాత్రమే కనుగొనగలవు. అయితే అతినీల లోహిత కిరణాలు 400- 10 నానోమీటర్ల తరంగధైర్ఘ్యంతో ఉంటాయి. అందుకే ఆ కిరణాలు మన శరీరంలోకి చొచ్చుకెళ్లడాన్ని మనం గమనించలేము.
ఇదిలా ఉంటే సూర్యుడి నుంచి మూడు రకాల అతినీల లోహిత కిరణాలు వెలువడుతాయి. వాటిలో యూవీఏ, యూవీబీ వలన మన శరీర కణాలకు త్వరగా వృద్దాప్యం రావడంతో పాటు డీఎన్‌ఏకు నష్టం కలుగుతుంది. వీటి రెండింటి కంటే యూఏసీ శరీరానికి ఎక్కువ నష్టం కలగజేస్తుంది. అయితే భూవాతావరణంలోకి ఈ కిరణాలు అంత సులభంగా ప్రవేశించలేవు. కాగా శరీర క్యాన్సర్‌కు అతినీల లోహిత కిరణాలు ప్రధాన కారణమన్న అందరికీ తెలిసిందే.