పార్టీకి వ్యతిరేకంగా సీఏఏ, ఎన్నార్సీకి శివసేన ఎంపీ మద్దతు!
ఇటీవలే ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కి తాను మద్దతు ఇస్తున్నానని శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. తాను సమావేశాల్లో బిజీగా ఉన్నందు వల్లే సీఏఏ, ఎన్నార్సీని సమర్థిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీలకు హాజరుకాలేక పోతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన నియోజకవర్గమైన హింగోలి ప్రజలకు ఆయన లేఖ రాశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో మాత్రం బిల్లును వ్యతిరేకించిన విషయంవిదితమే. అదే విధంగా తాము సీఏఏకు వ్యతిరేకమని […]

ఇటీవలే ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కి తాను మద్దతు ఇస్తున్నానని శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. తాను సమావేశాల్లో బిజీగా ఉన్నందు వల్లే సీఏఏ, ఎన్నార్సీని సమర్థిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీలకు హాజరుకాలేక పోతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన నియోజకవర్గమైన హింగోలి ప్రజలకు ఆయన లేఖ రాశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో మాత్రం బిల్లును వ్యతిరేకించిన విషయంవిదితమే. అదే విధంగా తాము సీఏఏకు వ్యతిరేకమని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ఈ క్రమంలో శివసేన తీరును పార్టీ మద్దతుదారులు విమర్శించారు. అదే విధంగా మరికొంత మంది సీఏఏ, ఎన్నార్సీని సమర్థిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. సవరించిన పౌరసత్వ చట్టం హిందుత్వ ఐకాన్ అయిన సావర్కర్ అభిప్రాయాలకు విరుద్ధమని అన్నారు. సావర్కర్ ఊహించినట్లుగా మీరు దేశాన్ని ఏకం చేయబోతున్నారా? మీరు ఆ దేశాల నుండి (పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) హిందువులను రప్పిస్తున్నారు. అంటే మీరు సావర్కర్ ఆలోచనలను నిర్లక్ష్యం చేస్తున్నారు” అని థాకరే పేర్కొన్నారు.



