కమలా హారిస్ తో శత్రుఘ్న సిన్హా మేనకోడలి స్నేహం
అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టనున్న కమలా హారిస్ తో తన మేనకోడలు ప్రీతా సిన్హాకి ఎంతో సాన్నిహిత్యం ఉందని...

అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టనున్న కమలా హారిస్ తో తన మేనకోడలు ప్రీతా సిన్హాకి ఎంతో సాన్నిహిత్యం ఉందని సినీనటుడు, రాజకీయ నేత శత్రుఘ్న్ సిన్హా వెల్లడించారు. తన అన్న డాక్టర్ లక్ష్మణ్ సిన్హా కుమార్తె ప్రీతా…కమలా హారిస్ తో కలిసి ఉన్న ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. కమలతో బాటు జో బైడెన్ ని శత్రుఘ్న సిన్హా అభినందించారు. మీ నాయకత్వంలో అమెరికా మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.