హైదరాబాద్ నైజాం వజ్రాల హారం.. అమెరికాలో..!

హైదరాబాద్‌కు చెందిన ఓ వజ్రాల హారం ఇప్పుడు అమెరికాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. న్యూయార్క్‌లో వేలం వేయనున్న ఈ హారం అమెరికా సంపన్నులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సుమారు పది కోట్ల రూపాయల విలువ చేసే హైదరాబాద్ హారాన్ని కొనుగోలు చేసేందుకు అమెరికాలో అత్యంత సంపన్నులు ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇండియాని పాలించిన మొఘల్ వంశీయుల ఆభరణాలు, ఆయుధాలను ఈ నెల 19న వేలం వేయనున్నారు. ఇందుకోసం న్యూయార్క్‌లోని క్రిస్టీ వేలం భవనంలో వాటిని ప్రదర్శనకు పెట్టారు. […]

హైదరాబాద్ నైజాం వజ్రాల హారం.. అమెరికాలో..!
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2019 | 12:59 PM

హైదరాబాద్‌కు చెందిన ఓ వజ్రాల హారం ఇప్పుడు అమెరికాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. న్యూయార్క్‌లో వేలం వేయనున్న ఈ హారం అమెరికా సంపన్నులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సుమారు పది కోట్ల రూపాయల విలువ చేసే హైదరాబాద్ హారాన్ని కొనుగోలు చేసేందుకు అమెరికాలో అత్యంత సంపన్నులు ఇప్పుడు క్యూ కడుతున్నారు.

ఇండియాని పాలించిన మొఘల్ వంశీయుల ఆభరణాలు, ఆయుధాలను ఈ నెల 19న వేలం వేయనున్నారు. ఇందుకోసం న్యూయార్క్‌లోని క్రిస్టీ వేలం భవనంలో వాటిని ప్రదర్శనకు పెట్టారు. వాటిలో హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజుల ఆభరణాలూ ఉన్నాయి. వీటిలో ఒక హారం అమెరికా సంపన్నులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 1890ల నాటికి చెందిన నిజాం ప్రభువుల హారాన్ని ఈ నెల 19వ తేదీన వేలం వేయనున్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఉంగరం, కత్తి, మరో చక్రవర్తి జహంగీర్‌కు చెందిన రత్నాలతో పాటు హైదరాబాద్ హారాన్ని వేలం వేయబోతోంది క్రిస్టీ ఆర్గనైజేషన్.