భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. తొలుత మార్కెట్లు మందకొడిగా కదిలినా చివర్లో భారీ నష్టాల్లోకి జారిపోయాయి. అధిక స్థాయిల్లో మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాఫెల్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన తరవాత నుంచి మార్కెట్ పడుతూనే వచ్చింది. సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయి 38,573 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 11,587 వద్ద ముగిశాయి.హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా పతనం కావడంతో మార్కెట్ కుంగింది. […]

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. తొలుత మార్కెట్లు మందకొడిగా కదిలినా చివర్లో భారీ నష్టాల్లోకి జారిపోయాయి. అధిక స్థాయిల్లో మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాఫెల్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన తరవాత నుంచి మార్కెట్ పడుతూనే వచ్చింది. సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయి 38,573 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 11,587 వద్ద ముగిశాయి.హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా పతనం కావడంతో మార్కెట్ కుంగింది. ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్లు 8శాతం లాభపడి రూ.149 మార్కును తాకాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. మరోపక్క యూరప్-అమెరికా మధ్య ట్రేడ్‌వార్ మరోసారి భగ్గుమనడం కూడా మార్కెట్ భయాలకు కారణమైంది.




