ఏపీ ఓటర్లకు రైల్వేశాఖ గుడ్ న్యూస్

హైదరాబాద్: ఏపీ ఓటర్లకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కిక్కిరిసి పోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉన్న చాలామంది ఆంధ్రా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారివారి స్వస్థలాలకు బయల్దేరారు. ఇక ఇప్పటికే చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బస్సులు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే ఆంధ్రాకు ప్రత్యేకంగా మరో 36 రైళ్లను […]

ఏపీ ఓటర్లకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 10, 2019 | 7:22 PM

హైదరాబాద్: ఏపీ ఓటర్లకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కిక్కిరిసి పోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉన్న చాలామంది ఆంధ్రా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారివారి స్వస్థలాలకు బయల్దేరారు. ఇక ఇప్పటికే చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బస్సులు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే ఆంధ్రాకు ప్రత్యేకంగా మరో 36 రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సతీష్‌ మాట్లాడుతూ ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు 40 రైళ్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఇవే కాకుండా వేసవి, ఎన్నికల రద్దీ దృష్ట్యా రానున్న మూడు రోజుల్లో ప్రత్యేకంగా 36 రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. గుంటూరు, విజయవాడ, విశాఖకు ప్రతిరోజు 28 రైళ్లు నడుస్తుండగా.. వీటితో పాటు మరో 11 రైళ్లు ప్రతిరోజు అదనంగా నడపనున్నారు. గుంతకల్‌, కర్నూలు, తిరుపతికి 16 రైళ్లు ఉన్నప్పటికీ అదనంగా 9 రైళ్లు నడుపుతామని ఆయన పేర్కొన్నారు.