కరోనా ఎఫెక్ట్: విద్యార్థులకు తీపి కబురు.. తగ్గనున్న సిలబస్..

కరోనా ఎఫెక్ట్: విద్యార్థులకు తీపి కబురు.. తగ్గనున్న సిలబస్..

School syllabus reduced: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల సిలబస్ తగ్గించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. సోషల్ మీడియాలో విద్యార్థులతో నిర్వహించిన లైవ్ వెబినార్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్ అమలు చేస్తోందని చెప్పారు. కాగా.. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 8:48 PM

School syllabus reduced: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల సిలబస్ తగ్గించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. సోషల్ మీడియాలో విద్యార్థులతో నిర్వహించిన లైవ్ వెబినార్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్ అమలు చేస్తోందని చెప్పారు.

కాగా.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 27వ తేదీన మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విద్యార్థుల తల్లిదండ్రులతో మొదటిసారి లైవ్ వెబినార్ నిర్వహించారు. అందులో పిల్లల చదువులపై తల్లిదండ్రులకు ఉన్న అనేక ఆందోళనలను పోగొట్టేందుకు ప్రయత్నించారు. దానికి అనుసంధానంగా ఈ రోజు రెండోసారి విద్యార్థులతో వెబినార్ నిర్వహించి వారికి తీపి కబురును అందించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu