టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టీడ్కో గృహల వద్ద...

టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టీడ్కో గృహల వద్ద టీడీపీ నాయకులు ‘నా ఇల్లు- నా సొంతం’ కార్యక్రమం పేరుతో గొడవకు దిగారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గృహాల వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వచ్చి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. ఈ క్రమంలో సైట్ ఇంజనీర్లుగా పనిచేస్తోన్న తమను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు దిగారని తలారి గోపి, వెంగళ నాగేంద్ర బాబు అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీంతో రావి వెంకటేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Also Read :
తెలుగు పరిశ్రమ నాకు ప్రాణ సమానం : పూజా హెగ్డే
Andhra NewsCase Filed On Ravi Venkateswara RaoGudivada EX MLA Ravi Venkateswara RaoRaavi Venkateswara Rao(TDP)Tv9 Breaking News