ఇది కుట్ర ! ఆరిజోనాలో ట్రంప్ మద్దతుదారుల నిరసనలు

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నికయ్యారన్న ప్రకటనను ఖండిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో శనివారం సాయంత్రం ఆరిజోనాలో నిరసనలకు దిగారు. ఇక్కడి ఫోనిక్స్ లో భారీ ప్రదర్శన చేశారు. ఎన్నికను ‘దొంగిలించేందుకు’ (అవతలివ్యక్తికి సపోర్ట్ ఇచ్చేందుకు) మీడియా కూడా కుమ్మక్కయిందని, ఈ ఫలితాలు ఓ కుట్ర అని వారు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ టాలీని వారు ప్రశ్నించారు. రిజెక్ట్ అయిన ఓట్లను అధికారులు తప్పుడుగా లెక్కించారని, ఫలితాలు బైడెన్ కి అనుకూలంగా […]

ఇది కుట్ర ! ఆరిజోనాలో ట్రంప్ మద్దతుదారుల నిరసనలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 08, 2020 | 6:39 PM

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నికయ్యారన్న ప్రకటనను ఖండిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో శనివారం సాయంత్రం ఆరిజోనాలో నిరసనలకు దిగారు. ఇక్కడి ఫోనిక్స్ లో భారీ ప్రదర్శన చేశారు. ఎన్నికను ‘దొంగిలించేందుకు’ (అవతలివ్యక్తికి సపోర్ట్ ఇచ్చేందుకు) మీడియా కూడా కుమ్మక్కయిందని, ఈ ఫలితాలు ఓ కుట్ర అని వారు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ టాలీని వారు ప్రశ్నించారు. రిజెక్ట్ అయిన ఓట్లను అధికారులు తప్పుడుగా లెక్కించారని, ఫలితాలు బైడెన్ కి అనుకూలంగా వచ్ఛేట్టు డెమొక్రాట్లు జోక్యం చేసుకున్నారని అన్నారు. ‘ఓట్లను మళ్ళీ లెక్కించండి..మేము గమనిస్తున్నాం’ అని ఆందోళనకారులు కేకలు పెట్టారు. కొంతమంది ఎన్నికల కార్యాలయంలోకి చొరబడేందుకు యత్నించారు. అసలు ఈ ఎన్నికలో ట్రంప్ గెలిచారన్న విషయం తమకు తెలుసునని కొందరు పేర్కొన్నారు. అనేకమంది నిరసనకారులు సెమి ఆటోమాటిక్ ఆయుధాలు ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.