ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్…

|

Aug 17, 2020 | 12:50 AM

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు పలు రకాల ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది.

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్...
Follow us on

SBI Good News: స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు పలు రకాల ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక నుంచి ఎస్ఎంఎస్ అలెర్ట్స్, మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 15న స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ట్విట్టర్ ద్వారా ఖాతాదారులకు సమాచారం అందించింది.

కాగా, ఎస్బీఐ గతంలో అర్బన్ ప్రాంతాల్లో అకౌంట్ ఉన్నవాళ్లు రూ. 3000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న బ్రాంచుల్లో ఖాతా ఉన్నవారు రూ. 2000, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఖాతా ఉన్నవాళ్లు రూ. 1000 ఉంచుకోకపోతే జరిమానాలు విధించేది. అటు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం ప్రతీ త్రైమాసికానికి రూ. 12+జీఎస్టీ వసూలు చేసేది. ఇప్పుడు ఆ ఛార్జీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..