కస్టమర్లకు అలర్ట్.. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేటు తగ్గించిన బ్యాంకులు..

బ్యాంకు ఖాతాదారులకు సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేటు మరింత తగ్గింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ ఎస్‌బీ ఖాతాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించాయి. ఎస్‌బీఐ తన ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై

  • Tv9 Telugu
  • Publish Date - 11:38 am, Wed, 3 June 20
కస్టమర్లకు అలర్ట్.. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేటు తగ్గించిన బ్యాంకులు..

బ్యాంకు ఖాతాదారులకు సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేటు మరింత తగ్గింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ ఎస్‌బీ ఖాతాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించాయి. ఎస్‌బీఐ తన ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటును 2.75 శాతం నుంచి 2.70 శాతానికి తగ్గించింది. మే 31 నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు కూడా రూ.50 లక్షల లోపు ఉండే ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం నుంచి మూడు శాతానికి, రూ.50 లక్షలపైన ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు గురువారం నుంచి అమల్లోకి వస్తుంది.

Also Read: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..