పాకిస్థాన్ మాకు ఎంతో ఇష్టమైన దేశం..

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:50 PM

ఇస్లమాబాద్: పాకిస్థాన్ మాకు ఎప్పుడూ ఇష్టమైన దేశమే. త్వరలోనే పాకిస్థాన్ ఆర్ధికంగా బలపడుతుందని ఆశిస్తున్నాం. పాక్ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ వంటి నాయకులతో పలు అంశాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఎదురు చూస్తున్నాం. పాక్‌పై ఆగ్రహంతో ఉన్న భారతీయులకు ఈ వ్యాఖ్యలు చిరాకు తెంపించేవిగా ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్. ఆయన ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ […]

పాకిస్థాన్ మాకు ఎంతో ఇష్టమైన దేశం..
Follow us on

ఇస్లమాబాద్: పాకిస్థాన్ మాకు ఎప్పుడూ ఇష్టమైన దేశమే. త్వరలోనే పాకిస్థాన్ ఆర్ధికంగా బలపడుతుందని ఆశిస్తున్నాం. పాక్ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ వంటి నాయకులతో పలు అంశాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఎదురు చూస్తున్నాం. పాక్‌పై ఆగ్రహంతో ఉన్న భారతీయులకు ఈ వ్యాఖ్యలు చిరాకు తెంపించేవిగా ఉన్నాయి.

అయితే ఈ వ్యాఖ్యలు చేసింది సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్. ఆయన ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సుమారు 20 బిలియన్ డాలర్ల మేరకు అభివృద్ధికి సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగాయి.

ఇరువురు ఒప్పందాలపై సంతకాలు చేశారు. పాక్ పీఎం ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో యువరాజు సల్మాన్ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై తమకు నమ్మకం ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని అన్నారు. తాను యువరాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఇదే తన తొలి పర్యటన అని, పాక్‌తో అన్ని రకాల సంబంధాలు కోరుకుంటున్నామని అన్నారు.

పాక్ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని, భవిష్యత్తులో కూడా మరిన్ని ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంలోనే సౌదీలో ఖైదీలుగా ఉన్న 2107 మంది పాక్ పౌరులను విడుదల చేయాలని యువరాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు.