తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ
తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ దిలుసుఖ్ నగర్‌లోని అష్టలక్ష్మీ దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారు వరలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చారు. ఇక ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాసం, శుక్రవారంతో పాటు వ్రతం సందర్భంగా […]

తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ దిలుసుఖ్ నగర్‌లోని అష్టలక్ష్మీ దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారు వరలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చారు. ఇక ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాసం, శుక్రవారంతో పాటు వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.