ఈ తప్పు చేస్తే 'PM ఆవాస్' డబ్బు రాదు..!
TV9 Telugu
22 February 2025
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బు పొందడానికి ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అర్హులో కాదో మీ వార్షిక ఆదాయం నిర్ణయిస్తుంది. ఈ పథకాన్ని మూడు వర్గాలుగా విభజించారు.
మొదటి EWS (ఎకనామికలీ వీకర్ సెక్షన్) విషయానికి వస్తే వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉన్నవారు ఈ వర్గంలోకి వస్తారు.
రెండవది LIG (లో ఇన్‌కమ్ గ్రూప్)లో అయితే వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉన్నవారు అర్హులు.
మూడవ MIG-I(మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్)లో వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు ఉన్నవారు ఈ వర్గంలోకి వస్తారు.
మీ కుటుంబానికి ఇప్పటికే శాశ్వత ఇల్లు ఉన్నట్లయితే మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు.
ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా ఇప్పటికే ఇళ్ళు పొందిన వ్యక్తులు కూడా మంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకోలేరు.
మీరు ముందుగా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకున్న తర్వాతే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకోండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏదేశంలో ఉన్నారో తెలుసా?
ఇకపై భారత్లో ఉచితంగా ChatGPT
ఏయే దేశాల్లో భారతీయ భాషల్లో సైన్ బోర్డులు ఉన్నాయి?