AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమత, హాజీపూర్ కేసుల తుది తీర్పులు వాయిదా.!

Samata And Hajipur Rape Cases: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో రావాల్సిన తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఇందులో ఒకటి ఆసిఫాబాద్ సమత అత్యాచార కేసు కాగా.. మరొకటి హాజీపూర్ వరుస హత్యల కేసు. రెండు కేసుల్లోని నిందితులకు ఉరి శిక్షను విధించాలని ఇప్పటికే గ్రామస్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమత అత్యాచార కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవు తీసుకోవడంతో తుది తీర్పును […]

సమత, హాజీపూర్ కేసుల తుది తీర్పులు వాయిదా.!
Ravi Kiran
|

Updated on: Jan 27, 2020 | 1:47 PM

Share

Samata And Hajipur Rape Cases: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో రావాల్సిన తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఇందులో ఒకటి ఆసిఫాబాద్ సమత అత్యాచార కేసు కాగా.. మరొకటి హాజీపూర్ వరుస హత్యల కేసు. రెండు కేసుల్లోని నిందితులకు ఉరి శిక్షను విధించాలని ఇప్పటికే గ్రామస్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సమత అత్యాచార కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవు తీసుకోవడంతో తుది తీర్పును ఈ నెల 30వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసుపై తీర్పు ఇవాళ వెలువడే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా తుది తీర్పు వాయిదా పడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌ గ్రామ అటవీ ప్రాంతంలో  సమతపై అదే గ్రామానికి చెందిన షేక్‌ బాబా, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మగ్దూమ్‌లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి.. ఆపై హత్య చేశారు. ఇక ఈ కేసు విచారణ వేగవంతం కావడానికి డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

మరోవైపు హాజీపూర్ వరుస హత్యల కేసు తుది తీర్పును కూడా నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై తుది తీర్పు ఫిబ్రవరి 6న వెలువడనుంది.

2050లో తులం బంగారం ధర ఎంత ఉంటుంది.. ఈ లెక్కలు చూస్తే..
2050లో తులం బంగారం ధర ఎంత ఉంటుంది.. ఈ లెక్కలు చూస్తే..
వన్డేల తర్వాత టీ20 సిరీస్‌కు కూడా స్టార్ ప్లేయర్ దూరం
వన్డేల తర్వాత టీ20 సిరీస్‌కు కూడా స్టార్ ప్లేయర్ దూరం
జామ్‌ 2026 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్‌ కార్డుల లింక్ ఇదే
జామ్‌ 2026 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్‌ కార్డుల లింక్ ఇదే
అండర్-19 వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో యువ కెరటం
అండర్-19 వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో యువ కెరటం
పెరుగును ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే షాకే..
పెరుగును ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే షాకే..
రాజ్ కోట్ వన్డేలో భారత్ ఓటమికి అసలైన కారణాలివే
రాజ్ కోట్ వన్డేలో భారత్ ఓటమికి అసలైన కారణాలివే
టీ20 ప్రపంచకప్‌లో తోపు టీం ఏది.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇవే?
టీ20 ప్రపంచకప్‌లో తోపు టీం ఏది.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇవే?
మీకో సవాల్.. ఈ అడవిలో దాగిఉన్న గొడుగును గుర్తిస్తే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ అడవిలో దాగిఉన్న గొడుగును గుర్తిస్తే.. మీరే తోపులు!
తగ్గని బంగారం, వెండి జోరూ.. ఆల్‌టైం హైకి సిల్వర్.. తులం ఎంతంటే?
తగ్గని బంగారం, వెండి జోరూ.. ఆల్‌టైం హైకి సిల్వర్.. తులం ఎంతంటే?
NEET PG కటాఫ్‌ తగ్గింపుపై విమర్శలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!
NEET PG కటాఫ్‌ తగ్గింపుపై విమర్శలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!