ఇడ్లీ ఇలా చేసుకోండి.. ఇక రెచ్చిపోండి : సమంత, ఉపాసన

సెలబ్రిటీ వైవ్స్ సమంత అక్కినేని, ఉపాసన కొణిదెల సరికొత్త వంటతో ముందుకొచ్చారు. ఈ సారి ఈ ఇద్దరూ ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసి చూపించారు. మూములు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు.. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్ గా మారిపోతుందని ప్రిపరేషన్ సమయంలో చెప్పుకొచ్చింది సమంత. తాను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది. సమంత వంట చేస్తూ ఉంటే ఉపాసన […]

ఇడ్లీ ఇలా చేసుకోండి.. ఇక రెచ్చిపోండి : సమంత, ఉపాసన

Updated on: Oct 04, 2020 | 2:20 PM

సెలబ్రిటీ వైవ్స్ సమంత అక్కినేని, ఉపాసన కొణిదెల సరికొత్త వంటతో ముందుకొచ్చారు. ఈ సారి ఈ ఇద్దరూ ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసి చూపించారు. మూములు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు.. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్ గా మారిపోతుందని ప్రిపరేషన్ సమయంలో చెప్పుకొచ్చింది సమంత. తాను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది. సమంత వంట చేస్తూ ఉంటే ఉపాసన ఆమెతో ముచ్చట్లాడింది. సమంత తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పిందీ సందర్భంగా ఉపాసన. సమంత హెల్తీ ఫిట్ ఫుల్ ఫిల్లింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది. ఉపాసన అలా చెబుతుంటే సమంత టీజింగ్ గా నవ్వులొలకబోసింది.

తమ ఇంట్లో కూడా ఇడ్లీ మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ ఫాస్ట్ లా తీసుకుంటామని ఉపాసన తెలిపింది. ఉపాసన తనతో మాట్లాడుతూ ఉంటే, సమంత చకచకా ఓట్స్ , క్యారెట్ ఇడ్లీ చేసేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఇడ్లీని టేస్ట్ చేశారు. సమంత చేసిన ఓట్స్ క్యారెట్ ఇడ్లీ రుచి చూశాక ఇలాంటి ఇడ్లీలైతే తాను రోజూ తింటానని ఉపాసన అంది. ఇదీ.. వెరైటీ ఇడ్లీ సంగతి. ఇలాఉంటే, యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం కు సమంత వారం వారం గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తూ తన హెల్తీ టిప్స్ పంచుకుంటోంది. సమంత, ఉపాసన ఇద్దరూ ఈ ఫ్లాట్ ఫాం కోసం కలిసి పనిచేస్తున్నారు.