ఎంత అందంగా ఉన్నాడో.. ఎక్కడ గోతులు తవ్వుతున్నాడో..!

నాగచైతన్య లుక్‌పై సమంత తాజాగా కామెంట్స్ చేసింది. అమ్మ, ఆంటీలు, సిస్టర్, ఫ్రెండ్స్‌ అందరినీ పంపిన తర్వాత ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌కు టైం దొరికిందంటూ.. చైతూ సింగిల్‌గా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..

ఎంత అందంగా ఉన్నాడో.. ఎక్కడ గోతులు తవ్వుతున్నాడో..!
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 1:30 PM

దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. త్వరలోనే రానా పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ముంబైకి చెందిన మిహీకా బజాజ్ అనే యువతిని ప్రేమించాడు. తన ప్రపోజల్‌కి.. మిహీకా ఓకే చెప్పడాన్ని కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించారు. దీంతో బుధవారం రామానాయుడు స్టూడియోలో సాయంత్రం వీరిద్దరి వెడ్డింగ్‌కి సంబంధించిన విషయాలను మాట్లాడుకున్నారు. అలాగే సంప్రదాయంగా వధూవరులకు పట్టు బట్టలు పెట్టారు. ఈ ఫంక్షన్‌కి టాలీవుడ్ హీరో, హీరోయిన్ నాగచైతన్య, సమంత కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో నాగ చైతన్య స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.

కాగా నాగచైతన్య లుక్‌పై సమంత తాజాగా కామెంట్స్ చేసింది. అమ్మ, ఆంటీలు, సిస్టర్, ఫ్రెండ్స్‌ అందరినీ పంపిన తర్వాత ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌కు టైం దొరికిందంటూ.. చైతూ సింగిల్‌గా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఓ కామెంట్ చేసింది సామ్. ‘నా భర్త ఎంత అందంగా ఉన్నాడో కదా.. ఎక్కడ గోతులు తవ్వుతున్నాడో అంటూ పోస్ట్’ చేసింది. ఈ పోస్ట్‌పై చైతూ కూడా రియాక్ట్ అయ్యాడు. ‘ఇది ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్ పోస్టులలో ఒకటిగా కనిపిస్తుంది’ అంటూ కామెంట్ చేశాడు.

Read More:

బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ

బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..