Sai Pallavi : ‘మహేశ్‌ ఫొటోలు జూమ్‌ చేసి చూస్తా’..సూపర్ స్టార్ అందంపై హైబ్రిడ్ పిల్ల ఆసక్తికర కామెంట్స్

మిల్క్ బాయ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?. ఉభయ తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు మహేశ్ అంటే పడిచస్తారు.

Sai Pallavi :  'మహేశ్‌ ఫొటోలు జూమ్‌ చేసి చూస్తా'..సూపర్ స్టార్ అందంపై హైబ్రిడ్ పిల్ల ఆసక్తికర కామెంట్స్
Follow us

|

Updated on: Dec 17, 2020 | 11:10 AM

మిల్క్ బాయ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?. ఉభయ తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు మహేశ్ అంటే పడిచస్తారు. కృష్ణ నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్..అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టారు. కేవలం సాధారణ ఆడియెన్స్ మాత్రమే కాదు చాలామంది హీరోయిన్స్ కూడా మహేశ్ బాబును తమ డ్రీమ్‌ బాయ్‌ అని చెప్పిన సందర్భాాలు ఉన్నాయి. తాజాగా హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవి కూడా మహేశ్ అభిమానుల లిస్ట్‌లో చేరిపోయారు.  మహేశ్‌ చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారని.. ఆయన ఫొటోలు చూసి ఫిదా అవుతుంటానని ఆమె పేర్కొన్నారు.

‘మహేశ్‌బాబు చాలా అందంగా ఉంటాడు. ఎనీ టైమ్ ఆయన శరీరం‌ మెరిసిపోతుంటుంది. కొన్నిసార్లు మహేశ్‌ ఫొటోలు చూసి… లుక్స్‌పరంగా ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడు? అనుకుని ఆశ్చర్యపోయేదాన్ని. ఇంకా చెప్పాలంటే, చాలావరకూ నేను ఆయన ఫొటోల్ని జూమ్‌ చేసి చూసి.. ఆయన ముఖంపై ఒక్క మచ్చ కూడా లేదని అనుకునేదాన్ని’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.  తెలుగులో ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోన్న సాయి పల్లవి.. రానాతో కలిసి ‘విరాటపర్వం’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read : 

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం