యువ ఆటగాళ్లకు మాస్టర్ సచిన్ సూచన…

పేస్‌ బౌలింగ్  అయినా స్పిన్‌ బౌలింగైనా బ్యాట్స్‌మెన్‌ కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని మాస్టర్ సచిన్‌ తెందూల్కర్‌ సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ లోటును పూడ్చుకోలేమని పేర్కొన్నారు.

యువ ఆటగాళ్లకు మాస్టర్ సచిన్ సూచన...
Follow us

|

Updated on: Nov 04, 2020 | 6:36 PM

Sachin Tendulkar to Urge the ICC : క్రికెట్ దిగ్గజం.. భారతీయ క్రికెట్ అభిమానుల దేవుడు.. సచిన్ యువ క్రికెటర్లకు కొన్ని సలహాలు.. సూచనలు చేశారు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎలా ఉండాలనే అంశంపై లేఖ రాశారు. పేస్‌ బౌలింగ్  అయినా స్పిన్‌ బౌలింగైనా బ్యాట్స్‌మెన్‌ కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని మాస్టర్ సచిన్‌ తెందూల్కర్‌ సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ లోటును పూడ్చుకోలేమని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో మ్యాచులో పరుగు తీస్తున్న దవళ్‌ కుల్‌కర్ణి తలకు ఫీల్డర్‌ విసిరిన బంతి బలంగా తాకడంతో ఆయన మరోసారి ఇలాంటి సూచన చేశారు.

షార్జా వేదికగా మంగళవారం రాత్రి ముంబై, హైదరాబాద్‌ తలపడ్డాయి. టాస్‌ ఓడిన రోహిత్‌సేన తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే ఇన్నింగ్స్‌ ఆఖరి బంతిని దవళ్‌ కుల్‌కర్ణి షాట్ కొట్టాడు. ఒక పరుగు పూర్తిచేశాడు. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో డీప్‌ నుంచి ఫీల్డర్‌ బంతిని కీపర్‌కు విసిరాడు. అదే సమయంలో క్రీజులోకి వస్తున్న కుల్‌కర్ణి తలకు ఆ బంతి నేరుగా బలంగా తగిలింది. దాంతో హెల్మెట్‌ దెబ్బతింది. నిజానికి అతడు గనక హెల్మెట్‌ ధరించకపోతే ఘోర ప్రమాదం జరిగేది.

అంతకు ముందు పంజాబ్‌తో తలపడిన మ్యాచులోనూ హైదరాబాద్‌ ఆటగాడు విజయ్ శంకర్‌ ఇలాగే గాయపడ్డాడు. పరుగు తీసే క్రమంలో ఫీల్డర్‌ విసిరిన బంతి పిచై అతడి తలకు బలంగా తగిలింది. దాంతో అతడు మైదానంలో కాసేపు విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించాక బ్యాటింగ్‌కు దిగాడు. తొలి బంతిని ఎదుర్కొంటూనే ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్‌ ఆశలకు గండి పడింది. వరుస వికెట్లు చేజార్చుకొని ఓటమి పాలైంది.

పరుగు తీసేటప్పుడూ బంతి తగిలే అవకాశం ఉండటంతో యువ క్రికెటర్లకు సచిన్‌ సలహా ఇచ్చారు. సురక్షితంగా ఉండేందుకు స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌తో సంబంధం లేకుండా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. దీనిని తప్పనిసరి నిబంధనగా మార్చాలని ఆయా బోర్డులను డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఓ ధార్మిక మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు గావస్కర్‌ విసిరిన బంతి రవిశాస్త్రి తలకు తగిలిందని, దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదమేమీ జరగలేదని గుర్తుచేసుకున్నారు.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..