ఆఫ్రికాలోని నైజీరియాలో అరిక్ ఎయిర్ బోయింగ్ 737 విమానం లాగోస్ నుండి పోర్ట్ హార్కోర్ట్కు వెళ్తుండగా 27 వేల అడుగుల ఎత్తులో ఎడమ ఇంజిన్ పేలింది. పైలట్లు అప్రమత్తమై బెనిన్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.