AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homemade incubator: కోడి గుడ్లను పొదగేయడానికి ఇంట్లోనే ఇంక్యూబేటర్ ఇలా..?

ఇంక్యుబేటర్ కొనడానికి వేల రూపాయలు ఖర్చు చేయకుండా, ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులతో తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్‌ను తయారు చేసుకోవచ్చు. కార్డ్ బోర్డ్, బల్బ్ ఉపయోగించి తేమ, ఉష్ణోగ్రత నియంత్రణతో గుడ్లను 21 రోజులు పొదిగి, విజయవంతంగా కోడిపిల్లలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం ...

Homemade incubator: కోడి గుడ్లను పొదగేయడానికి ఇంట్లోనే ఇంక్యూబేటర్ ఇలా..?
Egg Incubator
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2026 | 11:50 AM

Share

గుడ్ల నుంచి కోడిపిల్లలను ఇంట్లోనే సులభంగా పొదగడానికి ఇంక్యుబేటర్‌ను తయారు చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక్యుబేటర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో ఇంటి వద్దే ఇంక్యుబేటర్‌ను రూపొందించవచ్చు.

ఇందుకు కావాల్సినవి: కార్డ్‌బోర్డ్ పెట్టె (మీడియం రేంజ్), లైట్ హోల్డర్ + వైర్లు, 100W టంగ్‌స్టన్ బల్బ్(2), చెక్కపొట్టు / వరిపొట్టు, నీటి గిన్నె, థర్మామీటర్ (ఉష్ణోగ్రత చూసేందుకు), గుడ్లు + మార్కర్ పెన్.

తయారు చేసే విధానం: ముందుగా ఇంట్లో సులభంగా దొరికే కార్డ్‌బోర్డ్ పెట్టెను తీసుకోవాలి. ఆ పెట్టె ఒక వైపు కత్తితో రంధ్రం చేసి, అందులో లైట్ హోల్డర్‌ను బిగించి 100W టంగ్‌స్టన్ బల్బ్‌ను అమర్చాలి.

తర్వాత పెట్టె అడుగు భాగంలో చెక్కపొట్టు లేదా వరిపొట్టు వేసి, గుడ్లు పెట్టేలా సెట్ చేయాలి. ఇంక్యుబేటర్‌లో తేమ, ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేందుకు ఒక గిన్నెలో నీరు తీసుకుని బల్బ్ కింద పెట్టాలి. ఇది పెట్టెలో వేడి ఎక్కువగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే లోపల ఉష్ణోగ్రత తెలుసుకునేందుకు థర్మామీటర్‌ను తప్పనిసరిగా పెట్టాలి. పొదగాలనుకున్న గుడ్లను వరుసగా పెట్టెలో అమర్చి, ప్రతి గుడ్డు మీద మార్కర్‌తో గుర్తు పెట్టడం తప్పనిసరి. తర్వాత విద్యుత్ కనెక్షన్ ఇచ్చి బల్బు వెలిగాక పెట్టెను మూసివేయాలి.రోజుకు రెండుసార్లు (ఉదయం–సాయంత్రం) గుడ్లను తిప్పుతూ ఉండాలి. గుడ్డుపై ఉన్న గుర్తు ఒకసారి పైకి, మరోసారి కిందికి ఉండేలా తిప్పాలి. ఇలా 18 రోజుల వరకు ఈ ప్రాసెస్ కొనసాగించాలి. 19వ రోజు తర్వాత గుడ్లను తిప్పకూడదు. ఈ విధానం పాటిస్తే.. సాధారణంగా 21 రోజుల తర్వాత గుడ్ల నుంచి కోడిపిల్లలు బయటికి వస్తాయి. కార్డ్‌బోర్డ్ పెట్టె కావడంతో బల్బ్ దగ్గర అతి వేడి పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. వైర్లు బాగా ఇన్సులేషన్‌తో ఉండాలి. పిల్లలు దగ్గరికి రాకుండా సేఫ్ ప్లేస్‌లో ఉంచాలి.

Also Read: గడ్డి వాము వద్ద అదే పనిగా అరుస్తున్న గిన్ని కోళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా..