AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్ ఫ్రెండ్ తిరిగొచ్చింది..

పెంపుడు జంతువులతో ఆటలాడుతూ సరదా వీడియోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. క్రికెట్‌ లెజెంట్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇన్‌స్టాలో తాజాగా షేర్‌ చేసిన ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది...

సచిన్ ఫ్రెండ్ తిరిగొచ్చింది..
Sanjay Kasula
|

Updated on: Sep 16, 2020 | 12:28 AM

Share

కోవిడ్ కోరలు చాస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా గడప దాటడం లేదు. అయితే ఇంటికే పరిమితం కావడంతో రాకరాక వచ్చిన అవకాశం అంటూ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ లిస్టులో సచిన్ కూడా చేరిపోయాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను చిన్నపిల్లాడిగా మారుతున్నారు.  కొత్త కొత్త రెస్పీలు ట్రై చేస్తున్నారు. పెంపుడు జంతువులతో ఆటలాడుతూ సరదా వీడియోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. క్రికెట్‌ లెజెంట్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇన్‌స్టాలో తాజాగా షేర్‌ చేసిన ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

నా కొత్త స్నేహితుడు తిరిగొచ్చారు. క్రితం సారి నుంచి వీడు వడా పావ్‌ మిస్‌ అయినట్టుగా కనిపిస్తోంది అంటూ సచిన్‌ పెంపుడు పిల్లి వీడియోను షేర్‌ చేశారు. అంతకుముందు సచిన్‌ వడా పావ్‌ తయారు చేశారు. తన ఫేవరెట్‌ ఫుడ్‌ ఇదేనంటూ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు.

View this post on Instagram

My new friend is back! Looks like he’s missing the Vada Pav from the last visit. ?

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

వడా పావ్‌ కోసం ఓ అతిథి నక్కినక్కి చూస్తోందని పెంపుడు పిల్లిని ఉద్దేశించి ఫోటో కూడా షేర్‌ చేశారు. ఇప్పుడు అదే పిల్లిని ఉద్దేశించి అభిమానులతో పంచుకున్నారు. మామిడి పళ్లతో కుల్ఫీ ఎలా తయారు చేయాలో కూడా సచిన్‌ ఇటీవల ఓ పోస్టులో పేర్కొన్నారు. ఇక సచిన్ ముచ్చటైన పోస్టులతో ఫ్యాన్స్  సంబరపడిపోతున్నారు.