కారుకోసం సచిన్ ఓపెన్ అప్పీల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతటి స్థాయిలో ఉన్నారో తెలియంది కాదు. అయితే, అతడ్ని ఒక వెలితి వెంటాడుతోంది.. అది మారుతి సుజుకి - 800 కారు. తాను క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతటి స్థాయిలో ఉన్నారో తెలియంది కాదు. అయితే, అతడ్ని ఒక వెలితి వెంటాడుతోంది.. అది మారుతి సుజుకి – 800 కారు. తాను క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో స్వయంగా సంపాదించుకొన్న డబ్బుతో కొనుక్కొన్న కారది. వరల్డ్ క్లాస్ కార్లు ఉన్న తన గ్యారేజ్ లో తన మొదటి కారు లేకపోవడం సచిన్ ను చాలా బాధిస్తుందట. దురదృష్టవశాత్తూ తన ఫస్ట్ కార్ ఇప్పుడు తన దగ్గరలేదని .. అది ఎవరి దగ్గరున్నా వాళ్లు నిర్మోహమాటంగా తనను సంప్రదించాలని సచిన్ బహిరంగంగా వేడుకున్నాడు. తాను ఎంతో సెంటిమెంట్ గా భావించిన ఆ కార్ తిరిగి తన గ్యారేజీలో ఉంచాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇండియాకు చెందిన ప్రముఖ టేబుల్ టెన్నీస్ ప్లేయర్ ముదిత్ డాని నిర్వహించే ‘ఇన్ ది స్పోర్ట్‌లైట్’ షోలో సచిన్ ఈ అభ్యర్థన చేశారు.