14 వ అంతస్థు నుంచి కింద పడి రష్యన్ శాస్త్రవేత్త మృతి, స్నేహితుడే చంపాడా ? అంతా మిస్టరీ, దర్యాప్తు ప్రారంభం

కోవిడ్ వ్యాక్సిన్ పై నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్న 45 ఏళ్ళ  రష్యన్ శాస్త్రవేత్త అనుమానాస్పద స్థితిలో మరణించారు. అలెగ్జాండర్ కగన్ స్కీ అనే ఈయన సెయింట్ పీటర్స్ బర్గ్ లో..

14 వ అంతస్థు నుంచి కింద పడి రష్యన్ శాస్త్రవేత్త మృతి, స్నేహితుడే చంపాడా ? అంతా మిస్టరీ, దర్యాప్తు ప్రారంభం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 21, 2020 | 4:51 PM

కోవిడ్ వ్యాక్సిన్ పై నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్న 45 ఏళ్ళ  రష్యన్ శాస్త్రవేత్త అనుమానాస్పద స్థితిలో మరణించారు. అలెగ్జాండర్ కగన్ స్కీ అనే ఈయన సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన ఇంటి 14 వ అంతస్థు  కిటికీ నుంచి కింద పడి మృతి చెందారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ పైనే గాక, క్యాన్సర్ పై కూడా పోరాటం జరుపుతున్న ఈ  పరిశోధకుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, ఒంటిపై అండర్ వేర్ మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. బహుశా ఈయనను ఈయన స్నేహితుడే చంపాడా అని భావిస్తున్నారు. అతడిని వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో దేశంలో కోవిడ్ బారిన పడిన ఏడుగురు రోగులు కూడా హాస్పిటల్స్ కిటికీల నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. కగన్స్కీ  మృతిపై రష్యన్ ఇన్వెస్టిగేషన్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. లోగడ ఎడిన్ బరోలో 13 ఏళ్ళ పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఈయన పని చేశారు. ఇటీవల తన గ్రామానికి వెళ్లిన ఈ శాస్త్రవేత్త తో ఈయన స్నేహితుడు గొడవ పడ్డాడని, బహుశా ఈ హత్యకు అదే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఆయన సహచరులు తమ మిత్రుని మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

Video Courtesy: mailonline

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్