ఎగ్జిట్ పోల్స్: బలపడిన రూపాయి మారకం విలువ

| Edited By:

May 30, 2019 | 6:14 PM

రూపాయి విలువ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకే రోజు 48 పైసలు బలపడింది. రూపాయి విలువ ఏకంగా 1.22 శాతం పెరగడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే రూపాయి బలపడటానికి కారణం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో రూపాయి విలువ పెరిగి 69.74 రూపాయలకు చేరింది. శుక్రవారం డాలర్ విలువ 70.22 రూపాయల దగ్గర ముగిసింది. సోమవారం […]

ఎగ్జిట్ పోల్స్: బలపడిన రూపాయి మారకం విలువ
Follow us on

రూపాయి విలువ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకే రోజు 48 పైసలు బలపడింది. రూపాయి విలువ ఏకంగా 1.22 శాతం పెరగడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే రూపాయి బలపడటానికి కారణం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో రూపాయి విలువ పెరిగి 69.74 రూపాయలకు చేరింది. శుక్రవారం డాలర్ విలువ 70.22 రూపాయల దగ్గర ముగిసింది. సోమవారం ఉదయం భారీగా బలపడింది. రూపాయి విలువ ఇలాగే కొనసాగితే డిసెంబర్ నుంచి ఇదే గరిష్టం అవుతుంది. మరోవైపు మార్కెట్లు కూడా భారీగా లాభపడ్డాయి. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,421.90 పాయింట్లు పెరిగి 39352.67 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 421.10 పాయింట్లు పెరిగి 11828.30 మార్క్ చేరుకుంది.