జీఎహెచ్ఎంసీ సఫాయి కార్మికురాలు భారతమ్మని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
ఆదివారం పూట విధినిర్వహణలో జీఎహెచ్ఎంసీ సఫాయి కార్మికురాలు భారతమ్మ రక్తమోడింది. రోడ్డు మీద చెత్త ఊడ్చుతూ విధులు నిర్వహిస్తోన్న ఆమెను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ఛిద్రమైపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితురాలు సంతోష్ నగర్ ఐ ఎస్ సదన్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో తోటి కార్మికులు రోడ్డుమీద ధర్నా కు దిగారు. బాధితురాలని హుటాహుటీన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నప్పటికీ […]

ఆదివారం పూట విధినిర్వహణలో జీఎహెచ్ఎంసీ సఫాయి కార్మికురాలు భారతమ్మ రక్తమోడింది. రోడ్డు మీద చెత్త ఊడ్చుతూ విధులు నిర్వహిస్తోన్న ఆమెను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ఛిద్రమైపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితురాలు సంతోష్ నగర్ ఐ ఎస్ సదన్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో తోటి కార్మికులు రోడ్డుమీద ధర్నా కు దిగారు. బాధితురాలని హుటాహుటీన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.