బాబాయ్, నేను కలిసి నటించబోతున్నాము.. కన్ఫర్మ్ చేసిన రానా
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దగ్గుబాటి మల్టీస్టారర్ త్వరలోనే రానుందా..! వెంకటేష్, రానా కలిసి నటించబోతున్నారా..!

Venkatesh Rana Multistarrer: టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దగ్గుబాటి మల్టీస్టారర్ త్వరలోనే రానుందా..! వెంకటేష్, రానా కలిసి నటించబోతున్నారా..! ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. బాబాయ్, తాను కలిసి నటించబోతున్నట్లు రానా కన్ఫర్మేషన్ ఇచ్చారు. మేమిద్దరం కలిసి నటించేందుకు ఒక మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశాము. అయితే లాక్‌డౌన్‌లో ఆ స్క్రిప్ట్ మాకు దొరికింది అని రానా పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మిగిలిన వివరాలను మాత్రం రానా బయటపెట్టలేదు గానీ.. సురేష్ బాబు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే రానా నటించిన కృష్ణం వందే జగద్గురంలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ( కరోనా అప్‌డేట్స్: దేశవ్యాప్తంగా 85లక్షలు దాటిన కేసుల సంఖ్య)
కాగా ప్రస్తుతం వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్పలో నటిస్తున్నారు. అసురన్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి ఎఫ్ 3లో జాయిన్ అవ్వనున్నారు. ఇక మరోవైపు రానా, వెంకీ ఊడుగుల దర్శకత్వంలో విరాట పర్వంలో నటిస్తున్నారు. ఈ మూవీలో రానా సరసన సాయి పల్లవి నటిస్తున్నారు. ( మరోసారి కలిసి పనిచేయబోతున్న బన్నీ-త్రివిక్రమ్..!)