AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్.. జస్ట్ రూ.9కే చీర.. హీరోయిన్ వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే..

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గరుడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.9కే చీర ఆఫర్ ప్రకటించడంతో భారీగా మహిళలు తరలివచ్చారు. ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

బంపర్ ఆఫర్.. జస్ట్ రూ.9కే చీర.. హీరోయిన్ వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే..
Mall Opening Saree Offer
Shaik Madar Saheb
|

Updated on: Sep 22, 2026 | 7:37 AM

Share

బంపర్ ఆఫర్.. జస్ట్.. 9 రూపాయలకే చీర.. రండి త్వరపడండి.. అంటూ ఊదరగొట్టారు.. షాపింగ్ ప్రారంభం కోసం ముందస్తుగానే భారీగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఆ ప్రాంత వాసులతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాలు వారు కూడా రూ.9కే.. చీర దక్కించుకోవాలని ఆతృతగా ఎదురుచూశారు.. ఆ రోజు రానే వచ్చింది.. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా షాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఇంకేముంది.. తండోపతండాలుగా షాప్ కు తరలివచ్చారు.. దీంతో అందరూ.. ఒకేసారి షాప్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కస్టమర్ల మధ్య తోపులాట జరిగి.. పలువురికి గాయాలయ్యాయి.. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది.. జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గరుడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మాల్‌ని ప్రారంభించగా.. రూ.9కే చీర ఇస్తామంటూ నిర్వాహకులు ఆఫర్ ప్రకటించారు. దాంతో భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే.. సెక్యూరిటీ సిబ్బంది మేనేజ్ చేయలేక చేతులు ఎత్తేయడంతో.. తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి.. చాలాసేపు గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us