AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు షురూ.. సెప్టెంబర్, అక్టోబర్‌లో జరీగే కీలక పరీక్షలు.. తేదీలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక సమాచారం. SBI, SSC, IBPS, RRB వంటి కేంద్ర నియామక సంస్థలకు సంబంధించిన పలు పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరగనున్నాయి. SBI క్లర్క్, SSC CGL, IBPS PO/MT, IBPS క్లర్క్, RRB టెక్నీషియన్, RRB సెక్షన్ కంట్రోలర్, RRB JE తదితర పరీక్షల తేదీలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అభ్యర్థులు పరీక్ష తేదీలను గమనించి, అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్‌తో సన్నద్ధతను మరింత మెరుగుపరుచుకోవచ్చు..

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు షురూ.. సెప్టెంబర్, అక్టోబర్‌లో జరీగే కీలక పరీక్షలు.. తేదీలు ఇవే
Government Job Exam Dates
Srilakshmi C
|

Updated on: Sep 21, 2026 | 8:52 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 21: దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర నియామక సంస్థలు పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలు కీలక నియామక పరీక్షలు జరగనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)లకు సంబంధించిన పరీక్షలు ఈ రెండు నెలల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీలను ముందుగానే తెలుసుకుని, అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్‌తో ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు.

సెప్టెంబర్, అక్టోబర్‌లో జరిగే పరీక్షల తేదీలు ఇవే..

  • SBI క్లర్క్ పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 26, 27 తేదీల్లో
  • SSC CGL (టైర్-1) పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు
  • IBPS PO/MT (మెయిన్స్) పరీక్ష తేదీ: అక్టోబర్ 4
  • RRB టెక్నీషియన్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 6, 9 తేదీల్లో
  • IBPS క్లర్క్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 10, 11 తేదీల్లో
  • RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 12, 13 తేదీల్లో
  • RRB JE పరీక్ష తేదీలు: అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో

పరీక్ష తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు తమకు సంబంధించిన సిలబస్‌ను మరోసారి పరిశీలించుకోవాలి. ఇప్పటికే చదివిన అంశాలను రివిజన్ చేయడంతో పాటు మాక్ టెస్టులు, ప్రీవియస్ పేపర్లు, ప్రాక్టీస్ ప్రశ్నలను సాధన చేయడం ద్వారా పరీక్షకు సన్నద్ధతను పెంచుకోవచ్చు. అలాగే ప్రతి పరీక్షకు సంబంధించిన CBT విధానం, సిలబస్, పరీక్ష సమయం, మార్కుల విధానం వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవాలి. పరీక్షకు ముందు చివరి రోజుల్లో కొత్త అంశాల కంటే రివిజన్, మాక్ టెస్టులు, ముఖ్యమైన టాపిక్స్‌పై దృష్టి పెట్టడం ఉపయోగకరంగా ఉంటుంది.

Follow Us