రోహిత్ అచ్చం ధోనిలానే ఆలోచిస్తాడు…

భారత డాషింగ్ ఓపెనర్, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. మైదానంలో రోహిత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని.. ఎలాంటి పరిస్థితినైనా కూడా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడని తెలిపాడు. అంతేకాక మిగతా ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేస్తాడని రైనా కొనియాడాడు. ‘మైదానంలో రోహిత్ చాలా కూల్‌గా ఉంటాడు. ఆటగాళ్లలో ప్రేరణ నింపుతాడు. ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చినా తాను పరుగులు చేయగలననే ఆత్మవిశ్వాసంతో బరిలోకి […]

రోహిత్ అచ్చం ధోనిలానే ఆలోచిస్తాడు...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 8:35 PM

భారత డాషింగ్ ఓపెనర్, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. మైదానంలో రోహిత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని.. ఎలాంటి పరిస్థితినైనా కూడా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడని తెలిపాడు. అంతేకాక మిగతా ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేస్తాడని రైనా కొనియాడాడు.

‘మైదానంలో రోహిత్ చాలా కూల్‌గా ఉంటాడు. ఆటగాళ్లలో ప్రేరణ నింపుతాడు. ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చినా తాను పరుగులు చేయగలననే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడు. ఇక అదే మిగిలిన క్రికెటర్లకు స్పూర్తినిస్తుందని రైనా పేర్కొన్నాడు. రోహిత్‌లో ఉన్న ధోని లక్షణాలంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. అతను అచ్చం మహీలానే నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్నాడని రైనా స్పష్టం చేశాడు. కాగా, ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన సంగతి తెలిసిందే.