India GDP: భారత జీడీపీ వృద్ది రేటు 7 శాతం.. ఈ ఏడాదికి ఐఎంఎఫ్ కీలక అంచనా..
దేశ జీడీపీ వృద్ది రేటు అంచనాను ఐఎంఎఫ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆర్టీఐ 7.1 శాతంగా అంచనా వేసిన క్రమంలో ఐఎంఎఫ్ కూడా అదే అంచనాను వెల్లడించింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల ప్రభావం భారత్‌పై ఉన్నా.. దేశీయంగా డిమాండ్ వల్ల బలంగా నిలుస్తుందని తెలిపింది.

2026-27 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పెంచింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది. జులైలో ఈ సంస్థ 6.4 శాతంగా దేశ జీడీపీ వృద్ది రేేటును అంచనా వేయగా.. ఇప్పుడు 7 శాతానికి పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిగిన ద్రవ్య విధాన పరపతి సమావేశాల్లో దేశ జీడీపీ వృద్దిని 7.1 శాతంగా అంచనా వేసింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ 7 శాతానికి చేర్చడం చర్చనీయాంశంగా మారింది. దేశీయంగా బలమైన డిమాండ్, సేవల కార్యకాలాపాలు పెరిగిన క్రమంలో ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ పెరిగే అవకాశముందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటం, సంస్కరణలు తీసుకువస్తుండటం వంటివి బలమైన వృద్దికి కారణమవుతున్నాయని తెలిపింది.
జీడీపీ వృద్ది రేటు పెంపు..
ఇక ఈ సంస్థ 2027-28 ఆర్దిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్దిని అంచనా వేసింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది జులైలో 6.7 శాతంగా అంచనా వేసి ఆ సంస్థ.. ఇప్పుడు దానిని పెంచింది. అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం వంటి పరిణామాల క్రమంలో భారతదేశ జీడీపీని ఐఎంఎఫ్ పెంచడం ఆసక్తికరంగా మారింది. యుద్దాలు, ఘర్షణ పరిస్థితులు ఇంధన సరఫరాలపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. భారత్ ఎక్కువగా విదేశాల నుంచి ఇంధనంను దిగుమతి చేసుకుంటుంది. ఎక్కువగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధార పడుతుంటంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటే దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం అమెరికా,ఇరాన్ మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటుండగా.. దేశ జీడీపీ అంచనాను పెంచింది. చమురు ధరలు ఎక్కువగా ఉన్నా.. దేశీయ డిమాండ్, సేవల రంగం సపోర్ట్‌తో జీడీపీ వృద్దిలో భారత్ బలంగా కొనసాగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రపంచ జీడీపీ ఎంతంటే..?
అటు 2026లో ప్రపంచ వృద్ధి 3.1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. జూలైలో విడుదల చేసిన రిపోర్టులో 3 శాతంగా ఫిక్స్ చేయగా.. ఇప్పుడు దానిని పెంచింది. అదే సమయంలో 2027లో ప్రపంచ వృద్ధి 3.4 శాతంగా స్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. గత నెలలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (OECD), S&P, ఫిచ్ వంటి ఇతర ప్రపంచ సంస్థలు కూడా భారతదేశ ఈ ఆర్ధిక సంవత్సరానికి GDP వృద్ధి అంచనాను సుమారు 7 శాతానికి పెంచాయి. మధ్యప్రాచ్య సంఘర్షణ ఉన్నప్పటికీ.. జూన్ త్రైమాసికంలో బలమైన ఆర్థిక కార్యకలాపాలు, పటిష్టమైన దేశీయ డిమాండ్ దీనికి ప్రేరణగా నిలిచాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు 2026లో 2.1 శాతం వృద్ధిని సాధిస్తాయని అంచనా వేసింది. జూలైలో అంచనా వేసిన 1.7 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది ఎక్కువగా చెప్పవచ్చు.
