AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పి, మోషన్ ప్రాబ్లం.. వామ్మో.. వైద్యులు ఇలా చేశారేంటి..

కాకినాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (GGH)లో ప్రసవం అనంతరం బాలింత కడుపులో స్టీల్‌ పరికరం ఉండిపోయినట్లు ప్రైవేట్ వైద్యులు నిర్ధారించడం కలకలం రేపింది.. గత నెల 29న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ఆమెకు ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో స్కానింగ్‌ చేయించారు. కడుపులో పరికరం ఉన్నట్లు గుర్తించడంతో తిరిగి GGHకి తీసుకెళ్లగా, వైద్యులు మరోసారి శస్త్రచికిత్స చేసి స్టీల్‌ పరికరం, దూదిని తొలగించారు.

15 రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పి, మోషన్ ప్రాబ్లం.. వామ్మో.. వైద్యులు ఇలా చేశారేంటి..
Kakinada Ggh Incident
Shaik Madar Saheb
|

Updated on: Oct 13, 2026 | 9:35 AM

Share

బాలింత కడుపులో స్టీల్ పరికరం, దూది అలాగే వదిలేసి కుట్లు వేసిన ఘటన కాకినాడ GGHలో జరిగింది. ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లిన బాలింతకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ స్కానింగ్‌లో ఈ విషయం బయటపడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. గత నెల 23న గర్బిణీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగం వైద్య బృందం ఆమెకు ప్రసవ సమయంలో సేవలు అందించింది. ప్రసవ ప్రక్రియలో భాగంగా గర్భాశయంలోని వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు ఎస్ఆర్ కాన్యులా అనే స్టీల్ పరికరాన్ని ఉపయోగించారు. డెలివరీ తర్వాత స్టీల్ పరికరం బయటకు తీయడం మరిచిపోయారు. అలాగే దూదిని కూడా కడుపులోనే వదిలేసి కుట్లు వేసినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

గత నెల 29న బాలింతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. GGH వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కడుపులోనే స్టీల్ పరికరం ఉండిపోయిందని స్కానింగ్‌లో గుర్తించి, GGHకి వెళ్లాలని సూచించారు. మరోసారి సర్జరీ చేసిన GGH డాక్టర్లు.. కడుపులో వదిలేసిన స్టీల్ పరికరం, దూదిని తొలగించారు.

కాగా.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు సమాచారం.. ఇలాంటి ఘటనలు జరగకుండా.. చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us