చెన్నైలో సినీ నటి ఖుష్బూ కారుకు ప్రమాదం.. తాను సురక్షితమేనంటూ నటి ట్వీట్.!

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. చెన్నైలోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో ఆమె...

చెన్నైలో సినీ నటి ఖుష్బూ కారుకు ప్రమాదం.. తాను సురక్షితమేనంటూ నటి ట్వీట్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 18, 2020 | 11:07 AM

Chennai Road Accident: ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. చెన్నైలోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఖుష్బూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ కావడంతో వేరే వాహనంలో ఆమె గమ్యస్థానానికి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక కారు ప్రమాద ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఖుష్బూ వెల్లడించారు. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల తాను క్షేమంగా బయటడ్డానని ఖుష్బూ ట్వీట్ చేశారు.