మరో వివాదం సృష్టించిన అమెరికన్ పాప్ స్టార్ రిహానా, గణేశ ప్రతిమ నెక్లెస్ ధరించి సెమి-న్యూడ్ గా

| Edited By: Anil kumar poka

Feb 16, 2021 | 6:55 PM

ఇండియాలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపి వివాదం రేపిన అమెరికన్ పాప్ స్టార్ రిహానా మరో కాంట్రోవెర్సీ   సృష్టించింది. హిందువుల ఆరాధ్య దైవమైన గణేశ...

మరో వివాదం సృష్టించిన అమెరికన్ పాప్ స్టార్ రిహానా, గణేశ ప్రతిమ నెక్లెస్ ధరించి సెమి-న్యూడ్ గా
Follow us on

ఇండియాలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపి వివాదం రేపిన అమెరికన్ పాప్ స్టార్ రిహానా మరో కాంట్రోవెర్సీ   సృష్టించింది. హిందువుల ఆరాధ్య దైవమైన గణేశ ప్రతిమ గల నెక్లెస్ ధరించి సెమి న్యూడ్ గా ఫోటో షూట్ లో పాల్గొంది. దీంతో హిందూ దేవుళ్లను అవమానించారంటూ ఆమెపై ట్రోలింగ్ మొదలయింది. ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న రిహానా మళ్ళీ చిక్కుల్లో పడింది. మా మత చిహ్నాన్ని (గణేశుడి ప్రతిమ) వినియోగించి ఈ విధమైన నెక్లెస్ ను ధరించరాదని,  మా హిందువులకు గణేశుడు భగవంతుడు, ఆరాధ్యుడని కొందరు ట్వీట్స్ చేస్తే..మరొక మతపరమైన చిహ్నం గల నెక్లెస్ ధరించి ఇలా చేస్తే వాళ్ళు నీ అంతు చూస్తారంటూ మరికొందరు ఆగ్రహంతో స్పందించారు.

భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని మంట గలుపుతున్న రిహానా వంటి వారి నుంచి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు  నేతలు  సాయం పొందడాన్ని మానుకోవాలని బీజేపీ నేత రామ్ కదమ్ ట్వీట్ చేశారు.  మరికొందరు నేతలు కూడా ఈ విధమైన ట్వీట్లు చేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

బెంగళూరులో కొంపముంచిన ధావత్.. ఏకంగా 103 మంది అపార్ట్‌మెంట్ వాసులకు కరోనా పాజిటివ్ నిర్దారణ

‘వాళ్ళ ఆలోచనలను ప్రక్షాళన చేయాల్సిందే’, దిశారవి ఉదంతంపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్