ప్రశంసించాల్సింది పోయి.. విమర్శలెందుకు బాబూ..?: అనిల్ కుమార్

పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఏపీకి రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందనిఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియ ఉత్తమ ఫలితాలనిస్తోందన్నారు. వరదల కారణంగా ప్రస్తుతం పోలవరం పనులు వాయిదా వేస్తున్నామని ఆయన చెప్పారు. నవంబర్ నుంచి డిజైన్ ప్రకారమే పోలవరం పనులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే పనిలో జగన్ ప్రభుత్వం ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని విమర్శలు చేస్తున్నారని అనిల్ కమార్ […]

ప్రశంసించాల్సింది పోయి.. విమర్శలెందుకు బాబూ..?: అనిల్ కుమార్
Minister Anil Kumar Yadav
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 1:01 PM

పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఏపీకి రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందనిఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియ ఉత్తమ ఫలితాలనిస్తోందన్నారు. వరదల కారణంగా ప్రస్తుతం పోలవరం పనులు వాయిదా వేస్తున్నామని ఆయన చెప్పారు. నవంబర్ నుంచి డిజైన్ ప్రకారమే పోలవరం పనులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే పనిలో జగన్ ప్రభుత్వం ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని విమర్శలు చేస్తున్నారని అనిల్ కమార్ జంకుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి శాఖలోనూ కమిషన్లు రావడం మాత్రమే చూశారు కాని.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా..? లేదా..? అనేది ఏ అధికారి పట్టించుకోలేదని అనిల్ కుమర్ విమర్శించారు. కాని జగన్ ప్రభుత్వం అలా కాదని.. దేశంలో ఎక్కడాలేని విధంగా రివర్స్ టెండరింగ్ పద్దతిని తీసుకొచ్చిందన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో నష్టం జరుగుతుందని పలువురు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారని, కాని అదే పనిని తక్కువ మొత్తంలోనే చేస్తామని ఆ సంస్థ ముందుకొచ్చినప్పుడు నష్టం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.