AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షంతో అనంత ఇక్కట్లు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడింది.. వర్షం వల్ల జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మడకశిరలో రాత్రి కురిసిన వర్షానికి చెక్‌డ్యాంలు పొంగాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదనీరు గ్రామాల్లోకి చేరుతోంది. యాడికిలో పలు కాలనీల్లో 2 అడుగుల మేర నీరు ప్రవహించింది. యాడికి మండలం పిన్నేపల్లిలో చెరువు పొంగుతోంది. నిట్టూరు, రెడ్డిపల్లి గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. […]

భారీ వర్షంతో అనంత ఇక్కట్లు
Anil kumar poka
|

Updated on: Sep 24, 2019 | 1:21 PM

Share

అనంతపురం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడింది.. వర్షం వల్ల జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మడకశిరలో రాత్రి కురిసిన వర్షానికి చెక్‌డ్యాంలు పొంగాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదనీరు గ్రామాల్లోకి చేరుతోంది. యాడికిలో పలు కాలనీల్లో 2 అడుగుల మేర నీరు ప్రవహించింది. యాడికి మండలం పిన్నేపల్లిలో చెరువు పొంగుతోంది. నిట్టూరు, రెడ్డిపల్లి గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. పెదవడుగూరు మండలంవెంకటంపల్లిలో వర్షానికి ఇల్లు కూలి చిన్నారి వైష్ణవి(7) మృతి చెందింది.ఉరవకొండ నియోజకవర్గం లోని విడపనకల్లు, వజ్రకరూరు మండల వ్యాప్తంగా  రాత్రి కురిసిన  కుండపోత వర్షం తో  లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లి జాతీయ రహదారుల పై ప్రవహించాయి. రహదారులన్నీ  చెరువులు, కుంటలను తలపించాయి. నెల్లూరు అంకొల NH 63 జాతీయ రహదారి పై దొనేకల్ వద్ద వాగె ప్రమాదకరం గా ప్రవహిస్తోంది. దీంతో బళ్ళారి గుంతకల్ మద్య రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వజ్రకరూరు మండలం చాయపురం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఉరవకొండ గుంతకల్ మద్య రాకపోకలు స్తంభించిపోయాయి.

పంటపొలాలు నీట మునిగాయి. పట్టణంలో పలు  కాలనీల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలలోకి కూడా భారీ నీరు చేరింది.అటు, గుత్తి మండల వ్యాప్తంగా కురిసిన  కుండపోత వర్షం తో  లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సుమారు 15 సంవత్సరాలుగా పారని ఉప్పువంకా, పెద్దవంకవాగులు పొంగిపొర్లాయి. కొండ ప్రాంతం నుండి డ్రైనేజీ ద్వారా పెద్ద కొండచిలువ కొట్టు రావడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. స్థానిక యువకులు కొండచిలువను కొట్టి చంపేశారు. గుత్తి మండల వ్యాప్తంగా బసినేపల్లి, చ్చానుపల్లి, కొజ్జేపల్లి, అనగానిదొడ్డి,కొత్తపేట, మాముడూరు, పూలకుంట, పి.ఎర్రగుడి, మాముడురు, ఈశ్వరపల్లి గ్రామాలలో భారీ వర్షం కురింది. దీంతో పంట పొలాల్లోకి నీరు చేరాయి.