బ్రేకింగ్: చంద్రబాబు ఇంటికి చివరి డెడ్‌లైన్.. ఆ రోజే కూల్చివేత..?

ఉండవల్లి కరకట్ట పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న ఇంటిని కూల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. కృష్ణానది ఒడ్డున నిర్మించిన లింగమనేని ఎస్టేట్స్‌లో అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాలని లేదా తామే కూల్చివేస్తామంటూ సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులకు ఈ శుక్రవారంతో గడువు తీరిపోనుంది. దీంతో శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం నుంచి అక్కడున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ చేపట్టేందుకు సీఆర్డీయే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని […]

బ్రేకింగ్: చంద్రబాబు ఇంటికి చివరి డెడ్‌లైన్.. ఆ రోజే కూల్చివేత..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2019 | 4:28 PM

ఉండవల్లి కరకట్ట పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న ఇంటిని కూల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. కృష్ణానది ఒడ్డున నిర్మించిన లింగమనేని ఎస్టేట్స్‌లో అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాలని లేదా తామే కూల్చివేస్తామంటూ సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులకు ఈ శుక్రవారంతో గడువు తీరిపోనుంది. దీంతో శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం నుంచి అక్కడున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ చేపట్టేందుకు సీఆర్డీయే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మించిన 24 కట్టడాలకు సీఆర్డీయే అధికారులు గతంలో నోటీసులు జారీ చేసింది. వీటిలో 19 కట్టడాల యజమానులు ఇప్పటికే సీఆర్డీయే నోటీసులకు సమధానాలు ఇచ్చారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు.. నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్తులో మార్పులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన ఐదు నిర్మాణాలకు సంబంధించి.. ఆయా భవనాల యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీటిని ఒక్కొక్కటిగా కూల్చివేయడానికి నిర్ణయించుకున్న అధికారులు ఆ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించారు.

ఈ క్రమంలో చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉన్న పాతూరి కోటేశ్వరరావు అనే వ్యక్తి నిర్మించిన ర్యాంపును అధికారులు ముందుగా కూల్చివేశారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న మిగిలిన నాలుగు నిర్మాణాలపైనా అధికారులు దృష్టిపెట్టారు. వీటిలో చంద్రబాబు నివాసం కూడా ఉందని సీఆర్డీయే వర్గాలు అనధికారికంగా చెబుతున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు నివాసం కూల్చివేత ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలీయడం లేదు. ఇక చంద్రబాబు నివాసానికి ఈసారి అధికారులు జారీ చేసినవి తుది నోటీసులు కావడం, గతంలో భవన యజమాని లింగమనేని రమేష్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడం వంటి కారణాలతో ఆయన నివాసం కూల్చివేత తప్పదన్న వాదన వినిపిస్తోంది.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.